Take a fresh look at your lifestyle.

‘‘దుఃఖంలో జీవించలేము..’’

“‘‌నిర్భయ’ ఓ అత్యాచార బాధితురాలు. ఆ బాధితురాలి కుటుంబం ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకునేందుకే ఈ వ్యాసం ..”

‘‘నా కూతురుపై జరిగిన దాడి గుర్తు వచ్చి ఆ రాత్రి ఏమి జరిగిందో అనే ఆలోచన వస్తే రాత్రిపూట చెమటలు పట్టి దుఃఖం ముంచుకు వస్తుంది. కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాను’’ అని నిర్భయ తల్లి చెప్పింది. ప్రతి ఆదివారం మా ఇంటిలో దుఃఖం తాండవిస్తుంది. ఎందుకంటే ఆదివారం కుటుంబం అంతా కలిసి ఆనందించే రోజు. నిర్భయ మొదటి సరిగా ఇంగ్లీష్‌ ‌ఫిలిం ‘లైఫ్‌ ఆఫ్‌ ‌పై’ చూడటానికి స్నేహితుడితో కలిసి వెళ్లింది. మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ‘‘ఆదివారం చాలా కష్టం మాకు. ఆమె మా చుట్టూ తిరుగుతున్నట్లు నాకు అనిపిస్తుంది’’ అని నిర్భయ తల్లి చెప్పింది. ఇంటి నుండి బయటకు వెళ్లడం చాలా వరకు మానేశా అని, కూతురు చనిపోయినప్పటి నుండి తన కోసం ఏమీ కొనుక్కోలేదని నిర్భయ తల్లి చెప్పింది. నిద్రలేమి నిర్భయ తల్లి అనారోగ్యానికి కారణం అవుతున్నది.

రాజధాని దిల్లీలో వణికించే చలికాలం డిసెంబర్‌ ‌నెలలో 23 ఏళ్ల భారతీయ విద్యార్థిని బస్సులో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ దాడి తర్వాత ‘‘భారత్‌ ఓ ‌రేప్‌ ‌కాపిటల్‌’’ అని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ఆ‌గ్రహాన్నీ చవి చూసింది. మహిళ ల పై జరిగే అత్యాచార నిరోధక చట్టం ‘నిర్భయ’ చట్టం ఉనికిలోకి వచ్చింది. ఆమెపై దాడి చేసిన వారికి కోర్టు మరణశిక్ష విధించింది. బాధితురాలు..బాధితులు ఇద్దరు మరణించారు. ఇప్పుడు బాధితురాలి కుటుంబ పరిస్థితి ఏవిధంగా ఉందో వారి జీవితం ఎలా మారిపోయిందో చూద్దాం.

16 డిసెంబర్‌ 2012 ‌రాత్రి దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 16 గంటల పని దినం తర్వాత నిర్భయ తండ్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి తన కూతురు ప్రమాదానికి గురైందని,ఆమెను హాస్పిటల్‌ ‌కి తీసుకెళ్లారని ఓ పోలీసు నుండి నిర్భయ తండ్రికి కాల్‌ ‌వచ్చింది. ఒక గంట తరువాత, వైద్యులు చెబితే అతనికి తెలిసింది ఏమంటే తన కూతురుపై కొందమంది దుండగులు బస్సులో సామూహిక అత్యాచారం చేసారని. అక్కడికి రెండు వారాల తరువాత, ఆమె సింగపూర్‌లో ఒక హాస్పిటల్‌ ‌లో మరణించింది.’’దేశమా మేల్కొ’’.. ‘‘నిర్భయ చనిపోయింది’’ వంటి పతాక శీర్షికలతో వార్తా పత్రికలు, టీవీ చానళ్ళు మారు మోగిపోయాయి. భారతదేశం కోపంతో..ఆగ్రహంతో ఊగిపోయింది. నిర్భయ కుటుంబంలో క్షణాల్లో కల్లోలం అయిపోయిందని సమాజం బాధ పడింది. సుమారు తొమ్మిదేళ్లు కావస్తున్నది నిర్భయ ఆహుతి అయిపోయి మరి ఆమె కుటుంబ సభ్యులు వారి జీవితం ఎలా ఉందో చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. కనుక నిర్భయ తండ్రి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో చూద్దాం.

‘మెరుగైన ఆర్థిక పరిస్థితి’
దాడి జరిగి నిర్భయ హాస్పిటల్‌ ‌లో చేరిన కొన్ని గంటల తర్వాత నిర్భయ తండ్రిని సిబ్బంది . ‘‘మీ కూతురి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు మీ జేబులో తగినంత డబ్బు ఉందా..? డబ్బు గురించి ఆలోచించండి.’’ అని అడిగారు. డిసెంబర్‌ 16 ‌రాత్రి స్నేహితుడితో కలిసి నిర్భయ తండ్రి హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు డాక్టర్లు కొన్ని గంటలు దాటి నిర్భయ బతకదని అతనికి చెప్పారు.అప్పుడు అయన ఆలోచించింది చేతిలో వేయి రూపాయలు వున్నాయి ఎలా బిడ్డ మృతదేహాన్ని ఇంటికి ఎలా తీసుకుపోవాలి? అని. ఆ రాత్రి నిర్భయ బతికింది. మరుసటి రోజు ఒక రాజకీయ నాయకుడు వచ్చి నిర్భయ తండ్రికి 25,000 రూపాయలు ఇవ్వగానే అతనికి బాగా అనిపించింది. ఈ డబ్బుతో కనీసం కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోగలను అని అనుకున్నాడు. పేదరికం ఇచ్చిన ప్రాక్టికాలిటీ ఇది. పేదరికం కనీసం దుఃఖించటానికి అవకాశం ఇవ్వదు.
దాడి జరిగిన ఏడాది తర్వాత, దిల్లీ నగరం శివారు ప్రాంతంలో నిర్భయ కుటుంబానికి నష్ట పరిహారహారం కింద ప్రభుత్వం ఇచ్చిన రెండు గదుల అపార్ట్‌మెంట్‌లోకి నిర్భయ కుటుంబం షిఫ్ట్ అయ్యింది. వర్షం వస్తే ఇంటి నిండా చెమ్మ చేరిపోతుంది. మెట్ల లైట్లు రాత్రిపూట పనిచేయవు. అయినా కానీ ప్రస్తుత ఇల్లు గత ఇంటితో పోల్చితే మెరుగైనది. నిర్భయ బతికుండగా ఉన్న ఇంటిలో వర్షాకాలం ఇంటి గదులలో నీరు నిండిపోయేది. చుట్టుపక్కల ప్రాంతాలలో శిథిలమైన ఇళ్లలో ఒక ఇంటిలో నిర్భయ ఉండేది. ప్రస్తుతం ఆమె కుటుంబం గతం కంటే మెరుగైన ఇంటిలో వుంటున్నది.

అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నడుపుతున్న ఓ ప్రైవేట్‌ ‌కంపెనీ 54 ఏళ్ల నిర్భయ తండ్రికి కొత్త నౌకరీ ఇచ్చింది. కొత్త నౌకరీలో చేయాల్సిన పని రెగ్యులర్‌ అవర్స్ ‌లో ఎంట్రీ పాస్‌లను జారీ చేయటం. ఇందుకు గాను నెలకు 20,000 రూపాయల జీతం అందుతున్నది. గతంలో నిర్భయ తండ్రి విమానాశ్రయంలో బ్యాగేజ్‌ ‌లను ఒక చోటు నుండి మరో చోటుకి మోసేవారు. ఇందుకు గాను అతనికి నెలకు 6,620 రూపాయలు అందేవి . పైగా డబుల్‌ ‌షిఫ్ట్‌లలో పని చేసేవాడు. ఒక చిన్న ఫ్యాక్టరీలో ప్రెజర్‌ ‌కుక్కర్‌లను తయారు చేసే కార్మికుడిగా జీవితం మొదలు పెట్టి ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నాడు.

21 , 17 ఏళ్ళ వయస్సు గల ఇద్దరు అబ్బాయిలు నిర్భయ కుటుంబంలో ఉన్నారు. వీళ్లిద్దరు నిర్భయ తముళ్లు.పెద్ద తమ్ముడు ఒక ఉన్నత ఇంజనీరింగ్‌ ‌కళాశాలకు, చిన్న తమ్ముడు ప్రముఖ నగర పాఠశాలకు వెళుతున్నాడు. వీరి ఫీజు ప్రభుత్వం కడుతున్నది. పెద్ద తమ్ముడు కంప్యూటర్‌ ‌సైంటిస్ట్ ‌కావాలని, చిన్న తమ్ముడు డాక్టర్‌ అవ్వాలని ప్లాన్‌ ‌చేసుకుని చదువుతున్నారు. ఇప్పుడు నిర్భయ కుటుంబం చుట్టూ ఉన్న సమాజం కనికరంలేని చూపులు నిర్భయ కుటుంబంపై ప్రసరిస్తున్నది. నిర్భయ తల్లిదండ్రులు ప్రైమ్‌టైమ్‌ ‌టీవీ వార్తల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. చనిపోయిన కుమార్తెను గుర్తుచేస్తూ ఇచ్చే అవార్డు వేడుకలకు హాజరు అవుతుంటారు. ‘‘బాధితురాలు నిర్భయ కుటుంబం’’ మాతో పాటుగా నివాసం వుంటున్నది అని పొరుగున ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇంటిలోపల టేబుల్‌పై చిన్న టీవీ, చౌకైన వాషింగ్‌ ‌మెషిన్‌, ‌గ్యాస్‌ ‌సిలిండర్‌, ‌బాత్రూంలో కొత్త వాటర్‌ ‌హీటర్‌ ‌కనిపిస్తాయి. నిర్భయ తండ్రి ‘‘కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, పేదరికంలో మేము బాగున్నాం. కంటి నిండా నిద్రపోయాము. వున్నది తిని సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ రోజున మా దగ్గర ప్రతిదీ ఉంది అయినా ఏమీ లేదు. మా అమ్మాయి లేకుండా మా ప్రపంచం రంగులేనిది. నా కూతురు కుటుంబానికి ఇంజిన్‌. ‌మేమంతా ఇంజిన్‌కు బోగీలు లాంటివాళ్ళం’’అని అంటారు

తండ్రి నిర్భయను చదివించడానికి, డబుల్‌ ‌షిఫ్ట్‌లు పనిచేసేవాడు.2 లక్షల రూపాయలకు చిన్న భూమిని అమ్మి తన కూతురుని నాలుగు సంవత్సరాల ఫిజియోథెరపీ కోర్సులో చేర్పించాడు. 46 ఏళ్ల నిర్భయ తల్లి, గులాబీ రంగు షిఫాన్‌ ‌చీరను కట్టుకుని తలుపు వద్ద ఉన్న మీడియా వైపు చూస్తూ నిలబడి ఉంది. మీడియా ఇంటర్వ్యూ అడిగితె ‘‘నా కూతురు ఫోటో చేతిలో పట్టుకోనా’’ అని అడుగుతూ ఉంటుంది. న్యూరోలజీ.. న్యూరోసైన్స్..‌హ్యూమన్‌ అనాటమీ ఈ మూడు పుస్తకాలూ నిర్భయ చదివేది. ఈ పుస్తకాలు ఫోటో కాపీ చేయబడినవి. ఖరీదైన ఒరిజినల్స్ ‌నిర్భయ బతికి ఉండగా ఆమె కుటుంబం కొనలేకపోయింది. నిర్భయ వాడిన సమానులో కొన్నింటిని వారు తమతో కొత్త ఇంటికి తీసుకువచ్చారు. నిర్భయకు ఇష్టం అయిన పింక్‌ ‌బొమ్మ ఒకటి కనిపిస్తుంటుంది. ‘‘ఓ పాత ట్రంక్‌ ‌పెట్టెలో అక్క వేసుకున్న బట్టలు,రాసుకున్న నోట్సులు,ఆమె కన్న కలలు ప్యాక్‌ ‌చేసి వున్నాయి’’ అని నిర్భయ తమ్ముడు అంటాడు.

దుఃఖం జీవితాన్ని సులభంగా జీవించేలాగా చేయదు
‘‘నా కూతురుపై జరిగిన దాడి గుర్తు వచ్చి ఆ రాత్రి ఏమి జరిగిందో అనే ఆలోచన వస్తే రాత్రిపూట చెమటలు పట్టి దుఃఖం ముంచుకు వస్తుంది. కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాను’’ అని నిర్భయ తల్లి చెప్పింది. ప్రతి ఆదివారం మా ఇంటిలో దుఃఖం తాండవిస్తుంది. ఎందుకంటే ఆదివారం కుటుంబం అంతా కలిసి ఆనందించే రోజు. నిర్భయ మొదటి సరిగా ఇంగ్లీష్‌ ‌ఫిలిం ‘లైఫ్‌ ఆఫ్‌ ‌పై’ చూడటానికి స్నేహితుడితో కలిసి వెళ్లింది. మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ‘‘ఆదివారం చాలా కష్టం మాకు. ఆమె మా చుట్టూ తిరుగుతున్నట్లు నాకు అనిపిస్తుంది’’ అని నిర్భయ తల్లి చెప్పింది. ఇంటి నుండి బయటకు వెళ్లడం చాలా వరకు మానేశా అని, కూతురు చనిపోయినప్పటి నుండి తన కోసం ఏమీ కొనుక్కోలేదని నిర్భయ తల్లి చెప్పింది. నిద్రలేమి నిర్భయ తల్లి అనారోగ్యానికి కారణం అవుతున్నది .

తరచుగా నా కూతురు కలలో కనిపిస్తుంది.
‘‘కలలో వస్తుంది. ఆ కలలో నేను నిర్భయను చూడటానికి పట్టణంలోని పెద్ద హోటల్‌కి వెళ్తాను. ఆమె నన్ను కలుస్తుంది. నా దగ్గర నిలబడి నీకు డబ్బు అవసరమా..? అని అడుగుతుంది. నేను ఆమెకు చెప్తాను, నాకు డబ్బు అవసరం లేదు. నీ తమ్ములను జాగ్రత్తగా చూసుకో అని అటుపై ఆమె అదృశ్యమవుతుంది. డబ్బు గురించి చింతించవద్దని ఆమె ఎప్పుడూ చెప్పేది. ఆమె కుటుంబాన్ని చూసుకుంటున్నది’’ అని నిర్భయ తండ్రి చెప్పాడు. ఆమె మరణించిన మొదటి ఏడాది నుంచి నిర్భయ కుటుంబం ఒక చిన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ‘‘సాధ్యమైనంత వరకు ఆమె జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాము. ఒకరోజు ప్రజలు ఆమెను మర్చిపోతారని నాకు తెలుసు. కానీ ఆమె మరణం వలన కొంత అత్యాచార నిరోధక చట్టాలలో మార్పులు తీసుకు రాగలిగింది అని నిర్భయ తండ్రి అంటున్నారు. ‘‘మహిళలు ఇప్పుడు వేధింపులు మరియు హింసకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది నా కూతురుకి అందుతున్న నివాళి అని నిర్భయ తండ్రి అన్నారు.
– అరుణ ,జర్నలిస్ట్

Leave a Reply