Take a fresh look at your lifestyle.

ఇం‌టర్‌ అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

జూలై 31 తరువాత మార్కుల మెమోలు అందజేస్తాం : మంత్రి సబిత

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ ‌సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కెసీఆర్‌ ‌నిర్ణయం మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం మంత్రి సబిత కొరోనా కేసులు రోజురోజుకూ భారీ సంఖ్యలో పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 2020లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగగా అందులో ఫెయిలయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉత్తీర్ణులైన వారు కంపార్ట్‌మెంటులో ఉత్తీర్ణులైనట్లుగా పరిగణిస్తామని చెప్పారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల మెమోలను ఈనెల 31 తరువాత సంబంధిత కళాశాలల నుంచి పొందవచ్చని వివరించారు. రౌకౌంటింగ్‌, ‌రీ వెరిఫికేషన్‌ ‌కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను మరో 15 రోజుల తరువాత వెల్లడించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం లుగనుంది. ప్రస్తుతం మరో రెండు నెలల వరకు ఎలాంటి పరీక్షలను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఇక ఇంటర్‌ ‌సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply