Take a fresh look at your lifestyle.

నక్షత్రాల కింద… వీధి బతుకులు

“సుప్రీంకోర్టు మార్గదర్శకాల వెలుగులో ఈ పౌరులకు ప్రభుత్వాలు ఒక పథకం లాగ కొన్ని సౌకర్యాలు మాత్రమే కల్పిస్తుంది. ఈ దేశంలో ఇంకా ఎన్నో బసలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులో దీనికి సంబంధించిన అన్ని అంశాలను క్రోడీకరించి ఒక చట్టం తేవాలి. ఈ దిశగా ప్రజాస్వామిక వాదులు పౌర సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఒక చట్టం వస్తే ఈ అభాగ్య జీవులు వాళ్ళ అవసరాలు హక్కుగా పొంది గౌరవప్రదమైన జీవితం జీవించగలుగుతారు . ఇట్లా వినీలాకాశంలో నక్షత్రాల కింద వీధుల్లో అడుగుల పై ప్లాట్‌ ‌ఫారాల పై , పేవ్‌ ‌మెంట్లపై జీవితాలు గడిపే 2001 వ.సంవత్సరం జనాభా లెక్కలలో వీరిని ప్రత్యేకంగా లెక్కించారు.”

గత సంవత్సరం మార్చి నెలలో కోవిడ్‌ ‌విశ్వరూపం చూపించడం మొదలు కాగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అకస్మాత్తుగా లాక్డౌన్‌ ‌ప్రకటించగానే ప్రజలు అవాక్కయ్యారు. నేల ఈ ని నట్టుగా చిన్న పిల్లలు స్త్రీలు వృద్ధులతో సహా పెద్ద నగరాలను కలిపే రోడ్లపై నడుచుకుంటూ వెళ్ళడం చూశాం…..దేశంలోని అన్ని జాతీయ రహదారులపై అన్ని దిశలకూ వేల కిలోమీటర్లు కదులుతూ దర్శనమిచ్చారు. నాగరిక ప్రపంచంలో ఉన్నావని గర్వపడే వాళ్లంతా అయ్యో ఎం తో మంది కార్మికులు కష్టజీవులు నగరాల్లో ఉన్నారా , అని అమాయకంగా ఆశ్చర్యంగా ముక్కు మీద వేలు వేసుకున్నారు. పత్రికలు టీవీ ఛానళ్లు హృదయవిదారకర మైన కథనాలను చూపెట్టారు. సామాజిక పరిశోధకులు సర్వే చేసి దేశ జనాభాలో దాదాపు 37 కోట్ల మంది వలస జీవులు ఉన్నారు అని విశ్లేషించారు. వీళ్లంతా అసంఘటిత రంగ కార్మికులు వీళ్లకు రక్షణలు ఏవి అన్నారు. వీళ్లంతా ఈ దేశ పౌరులు వీళ్ళ పరిస్థితి ఇట్లా ఎందుకు తయారైంది అని అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. వీళ్లంతా గ్రామాల నుంచి దేశం లోని 800 పెద్ద నగరాల్లో కి పనులు చేసుకుని జీవితం గడపడానికి వచ్చిన వాళ్లే. అయితే ఇంత మంది నగరాలలో ఎక్కడ ఉన్నారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. వాళ్లలో చాలా మంది కార్మికులు చిన్నాచితకా గదులు కిరాయికి తీసుకొని ఉన్నారు. కొందరు వాళ్ళు పనిచేస్తున్న చిన్న కర్మాగారాల కాంపౌండ్‌ ‌కు గోడకు రేకుల ఆనించి , లేక రెండు బొంగుల చుట్టూ తడక వ చుట్టూ కట్టి దానికి ఇల్లు అని పేరు పెట్టి ఆ ఇంట్లో ఉంటారు. కొంతమంది ఇవేవీ కాకుండా ఆకాశంలోని నక్షత్రాలు కింద వీధి ప్లాట్ఫారం, రైల్వే స్టేషన్‌ ‌బస్‌ ‌స్టేషన్‌ ‌పక్కన షాపులు మూసివేసిన తర్వాత రాత్రి పూట వీధిలో బయట ఉండే మెట్లపై నివసిస్టా రు ఇంకా నివసిస్తున్నారు.

అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో 60 షెల్టర్లు ప్రతి జిల్లాలో కనీసం రెండు షెల్టర్లు ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌ ‌నగరంతో కలిపి తెలంగాణలో 35 షెల్టర్‌ ‌గృహాలు ఉన్నాయి. 60 హోమ్స్ ‌హైదరాబాద్‌ ‌లో ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం సుప్రీం కోర్టు కు చెప్పింది. కానీ హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌నగరాల్లో పురుషులకు 9, స్త్రీల కోసం నాలుగు హోమ్స్ ‌మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి ఆరంభం అయిన మొదట్లో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. సామాజిక సంస్థలు కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థలు చాలా కృషి చేసి ఇబ్బందులను ఎదుర్కొని వాటిని స్థాపించ గలిగారు. ఒక్కొక్క బస ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఉంది. వీటన్నిటినీ C4CS ( campaign for citizen shelters) అనే సామాజిక సంస్థ పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థలు జిహెచ్‌ఎం‌సి పై పెట్టిన ఒత్తిడి కారణంగా ఇప్పుడు ఈ ఆవాసాల నిర్వహణకు కొంత బడ్జెట్‌ ‌కేటాయిస్తున్నారు. బడ్జెట్‌ అం‌తా కూడా హోమ్‌ ఇన్‌ ‌ఛార్జి కి అందులో పనిచేసే సిబ్బంది కి మాత్రమే సరిపోతుంది. నగరపాలక సంస్థ విద్యుచ్ఛక్తి , త్రాగునీరు మాత్రమే అందిస్తుంది. భోజనానికి కావలసిన బియ్యం కూరగాయలు స్వచ్ఛంద సంస్థ సమకూర్చుకుంటుంది. కోవిద్‌ ‌వల్ల లాక్‌ ‌డౌన్‌ ‌విధించిన సమయాల్లో ఈ బసలన్నీ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఇందులో నివసించే వారికి కనీసం ఆహారం అందించాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఈ హోమ్స్ ‌నిర్వహిస్తున్న క్రమంలో చాలా సమస్యలు తలెత్తు తూ వస్తున్నాయి . . ఇందులో ఉండే వాళ్లంతా చిన్నా చితకా పనులు చేసుకునేవారు. ఇటువంటి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. జిహెచ్‌ఎం‌సి వసతి మాత్రమే కల్పించింది కానీ జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన ఈ పౌరులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టించే ప్రయత్నం పట్టించుకోలేదు. నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ ‌లో వాళ్ళకు నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించే అంశం కూడా ఉంది. ఈ హోమ్స్ ‌లో ఉంటూ మరణించిన వారిని ఖననం/ దహనం చేసే విషయంలో సమస్య తలెత్తింది. స్మశానవాటిక నిర్వహణ ఆ ప్రాంతపు స్థానిక పౌర కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎక్కడా కూడా ఉచితంగా దహనం /ఖననం చేసే అవకాశం ఉండదు. సంఘటన జరిగినప్పుడల్లా అధికారుల దగ్గరకు పరుగెత్తి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై ప్రభుత్వమే ఒక శాశ్వత ఆదేశం జారీ చేస్తే మంచిది. వీళ్లకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఆధార్‌ ‌కార్డులు ఇంకా సమస్య గానే ఉన్నాయి. నగర జీవితంలో ఖర్చులు బాగా పెరిగిపోవడం వల్ల కొందరు మాత్రమే ఖర్చు కు సిద్దపడి ఈ బసల నుండి కిరాయి ఇళ్ల లోకి వెళ్తున్నారు.

ఈ హోమ్స్ ‌దగ్గరలో ఉన్న రేషన్‌ ‌షాపు తో హోమ్‌ ‌ను అనుసంధానం చేసి బియ్యం సరఫరా ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. ఈ విషయంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పౌరసరఫరాల శాఖ శ్రద్ధ చూపడం లేదు. ఈ హోమ్స్ ‌నడిపించే సిబ్బంది ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉంది వాటిని కనీస వేతన స్థాయికి పెంచే విషయం నగరపాలక సంస్థ ఆలోచించాలి. నగరపాలక సంస్థకు సంబంధించిన ఒక అధికారికి వీటి నిర్వహణ పర్యవేక్షణ అతను లేదా ఆమెకు ఉండే ఇతర బాధ్యత ల్లో అదనపు బాధ్యత గా ఉంది. అదనం గా అప్పచెప్పా బడ్డ భాద్యత వల్ల ఈ అధికారులకు ఈ హోమ్‌ ‌లను సందర్శించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి సమయం దొరకడం లేదు. ఈ విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల వెలుగులో ఈ పౌరులకు ప్రభుత్వాలు ఒక పథకం లాగ కొన్ని సౌకర్యాలు మాత్రమే కల్పిస్తుంది. ఈ దేశంలో ఇంకా ఎన్నో బసలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులో దీనికి సంబంధించిన అన్ని అంశాలను క్రోడీకరించి ఒక చట్టం తేవాలి. ఈ దిశగా ప్రజాస్వామిక వాదులు పౌర సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఒక చట్టం వస్తే ఈ అభాగ్య జీవులు వాళ్ళ అవసరాలు హక్కుగా పొంది గౌరవప్రదమైన జీవితం జీవించగలుగుతారు.

ఇట్లా వినీలాకాశంలో నక్షత్రాల కింద వీధుల్లో అడుగులపై ప్లాట్‌ ‌ఫారాల పై, పేవ్‌ ‌మెంట్లపై జీవితాలు గడిపే 2001 వ.సంవత్సరం జనాభా లెక్కలలో వీరిని ప్రత్యేకంగా లెక్కించారు. అప్పటి అంచనాల ప్రకారం దేశంలోని నగరాలలో దాదాపు 40 లక్షల మంది ఎటువంటి ఆశ్రయం లేకుండా విధుల్లో నిద్రిస్తూ జీవిస్తున్నారని అన్నారు. ఈ అంచనాలు సరైనవి కావని చాలా స్వచ్ఛంద సంస్థలు వెంటనే ప్రకటించాయి. ఎవరి దృష్టిలో లేని ఈ మనుషుల్ని 2003 సంవత్సరంలో యాక్షన్‌ ఎయిడ్‌ అనే పెద్ద స్వచ్ఛంద సంస్థ కృషి చేసి వీరి లెక్కలు తేల్చి చెప్పడమే కాక అసలు ఈ దేశ పౌరులు పౌరులు ఎలా జీవిస్తున్నారు వారి సంక్షేమం ఎవరు చూస్తున్నారు అని సుప్రీం కోర్టు లో ఒక వాజ్యం వేసింది. ఈ కేసులో వీధుల్లో పడుకుంటూ దేశంలో ప్రతిఏటా చలికి, వర్షానికి, అనారోగ్యానికి ఎంత మంది చనిపోతున్నారు అని లెక్కలు చెప్పింది. సరైన ఆహారం లేక ఎంత మంది రోగాల పాలై మరణిస్తున్నారు, వీళ్లు ఎట్లా వీధి రౌడీలా చేతుల్లో, పోలీసుల చేతుల్లో బాధపడుతున్నారు కూడా తెలిపింది. అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ పౌరుల బాధ్యత నగరపాలక సంస్థ తీసుకోవాలని నగరాల్లో ప్రతి లక్ష మంది జనాభాకు ఒక షెల్టర్‌ ‌హోమ్‌ ఏర్పాటు చేయాలని అన్ని షెల్టర్‌ ‌హోమ్‌ ‌లలో త్రాగునీరు దినచర్యల కొంత నీరు ఆహారం నిద్ర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షక కమిటీలను కూడా నియమించింది. అప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి జనాభా ప్రకారం ప్రతి లక్ష మందికి ఒక చోట ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ ‌సమర్పించాయి. దేశంలోని 790 నగరాలను అధ్యయనం చేసి కొన్ని సామాజిక సంస్థలు సుప్రీం కోర్టు సూచించిన దాని ప్రకారం దేశంలో మొత్తం 2,18,750 షెల్టర్లు ఏర్పాటు చేయవలసి ఉంటుంది అని అభిప్రాయ పడ్డాయి.

గ్రామాలలో అమలు లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని పట్టణాల్లో నివసిస్తున్న పేద వర్గాల వారికి కూడా విస్తరింప చేయాలని ఒక ఆలోచన డిమాండ్‌ ‌గా వస్తుంది . అది పట్టణాలకు కూడా అమలు పరిస్తే , పట్టణాల్లో ఉండే పేదలతో పాటు వీధి బతుకులు సాగిస్తున్న ఈ పౌరులు కూడా గౌరవంగా జీవించగలుగుతారు. ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జయంతి కి ముందు రోజు రాత్రి,అంటే,1వ అక్టోబర్‌ ‌రాత్రి, దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో నడుపుతున్న సంస్థలు సిబ్బంది సామాజిక సంస్థలు కార్యకర్తలు స్థానిక పోలీసు మున్సిపల్‌ ‘‘‌నక్షత్రాల క్రింద’’(Under the stars) అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ బసలలో పనిచేసే సిబ్బంది,సామాజిక సంస్థలు,సామాజిక కార్యకర్తలు, పోలీసు,మున్సిపల్‌ ‌సిబ్బంది సహకారంతో ఆరు బయట రోడ్ల ప్రక్కన ,నిద్రపోతున్న వారిని పలకరించి బసలకు తీసుకువెళ్తారు. ఈ కార్యక్రమం శుక్రవారం రాత్రి అక్టోబర్‌ 1,2021 ‌న హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ ‌పార్కింగ్‌ ‌లాట్‌ ‌లో ప్రారంభం అవుతుంది. దీనిలో మనం అందరం పాల్గొని విజయవంతం చేద్దాం.

– ఎస్‌. ‌జీవన్‌ ‌కుమార్‌
‌మానవ హక్కుల కార్యక

Leave a Reply