Take a fresh look at your lifestyle.

ఎపిలో కొరోనా ఉధృతి

కొత్తగా 20,034 పాజిటివ్‌ ‌కేసులు
ఏపీలో కొరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,034 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యకు11,81,133 పెరిగింది. మరణాలు 8,289కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ లక్షకుపైగా శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కొరోనా అంతకంతకు విస్తరిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.  ఏపీలో కొరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో1,15,784 శాంపిల్స్ ‌పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ ‌కుమార్‌ ‌సింఘాల్‌ ‌వెల్లడించారు.

అలాగే, 82 మంది మృతి చెందినట్టు చెప్పారు. వైరస్‌ ‌బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.రాష్ట్రంలో ఆక్సిజన్‌ ‌సౌకర్యం ఉన్న పడకలు21,850 ఉన్నాయని తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇం‌జెక్షన్ల కొరత లేదని స్పష్టంచేశారు.

Leave a Reply