Take a fresh look at your lifestyle.

సీఏఏ ఆందోళనలు హింసాత్మకం

CM Kejriwal agitates on violence in Delhi
ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్‌లో ఉన్న భజన్‌పూరా ఏరియాలో మంటల్లో వాహనాలు. ఒక వ్యక్తి తుపాకితో కాల్పులు జరుపుతున్న దృశ్యం
  • రాళ్లు రువ్విన ఘటనల్లో కానిస్టేబుల్‌ ‌మృతి
  • ఢిల్లీలో హింసపై సీఎం కేజ్రీవాల్‌ ఆం‌దోళన

దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మరోసారి చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఢిల్లీ పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ ‌మృతిచెందారు. మరికొందరు పోలీసులు ఘర్షణలో గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఇక్కడి జఫ్రాబాద్‌ ‌ప్రాంతంలోని మౌజ్‌పుర్‌లో రెండోరోజు సోమవారం పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఇరు వర్గాలను చెదర గొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు. స్వల్ప లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు, దుకాణాలు, ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఓ ఫైరింజన్‌ ‌సైతం ధ్వంసమైందని అధికారులు తెలిపారు. ఆందోళన నేపథ్యంలో దిల్లీలోని జఫ్రాబాద్‌, ‌మౌజ్‌పుర్‌-‌బాబర్‌ ‌పుర్‌ ‌మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు మూసివేశారు. 24 గంటల పాటు జఫ్రాబాద్‌ ‌మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ ‌కార్పొరేషన్‌ (‌డీఎంఆర్‌సీ) పేర్కొంది. ఆదివారం సైతం ఇదే జఫ్రాబాద్‌ ‌ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఢిల్లీలో సోమవారం కూడా మళ్లీ హింస చెలరేగడంతో రెండవ రోజు కూడా దేశరాజధాని భగ్గుమన్నది.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా, మౌజ్‌పుర్‌, ‌జఫ్రాబాద్‌ ‌ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి. సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ దమనకాండలో ఓ ఆటోరిక్షా ధ్వంసమైంది. దానికి నిప్పు అంటించారు. ఓ వ్యక్తి తన చేతిలో గన్‌తో పోలీసు వైపు పరుగులు తీస్తూ కనిపించాడు. సీఏఏకు వ్యతిరేకంగా అక్కడ సుమారు వెయ్యి మంది మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. ఇవాళ జరిగిన సంఘటన పట్ల ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌స్పందించారు. ఢిల్లీలో శాంతియుత వాతావరణం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

Leave a Reply