Take a fresh look at your lifestyle.

బాటసారీ!సాగిపో!!

ఎవరి కోసం ఎదురు చూడకు నడు
నీ దారెంట…
గొడుగు పట్టే ఆకులు
నీతో కలిసొచ్చే జీవాలు
అడుగడుగునా పలకరించే
రాళ్ళూ, రప్పలూ ఉన్నాయిగా.
ఈ స్నేహాలు సరిపోవా?
ఈ మౌనం బాగోలేదు
ఈ నిశ్శబ్దం భయాంకరమంటావా!
దారిన వొచ్చీపోయే
అందరితో మాట్లాడాలనీ,
అందర్నీ వినాలని ఉందా!
వద్దులే మళ్లీ గాయపడతావు,
అలా చూస్తూ ఫో
అంతే గాని పయనం మానకు.
ఎవరో అటువెళ్లారు,
మరెవరో ఇటువెళ్లారు అని గాక
నువ్వూ వెళ్లు నీ దారిలో
నీ ఈ సంచారం కూడా
మరో గాధ అవుతుందిలే
ఎప్పటికైనా నీతో పోరాటంలో
నీవే గెలుస్తావులే.
– వేమూరి శ్రీనివాస్‌, 9912128967,
‌తాడేపల్లిగూడెం

Leave a Reply