Take a fresh look at your lifestyle.

2030 నాటికి .. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

“కోవిడ్‌ ఆం‌క్షలు క్రమంగా ఎత్తివేసినందున, ఆర్ధికవ్యవస్థ తిరిగి గాడిలో పదినప్పటికీ ఉత్పత్తి   పూర్వం కంటే తక్కువగానే ఉంది. భారతదేశ ఆర్ధిక పునరుద్ధరణకు ఇప్పటివరకు ఒక ముఖ్యమైన చోదక శక్తి వ్యవసాయ రంగం మెరుగైన ఉత్పత్తుల ద్వారా పుంజుకుంది.”

‌భారతదేశం 2019 లో బ్రిటన్‌ ‌ను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కానీ 2020 లో  కరోనా వలన 6 వ స్థానానికి దిగజారిందని  సెంటర్‌ ‌ఫర్‌ ఎకనామిక్స్ అం‌డ్‌ ‌బిజినెస్‌ ‌రీసెర్చ్ (‌సి.ఇ.బి.ఆర్‌) ‌తాజా వార్షిక నివేదికలో తెలిపింది. 2025 లో బ్రిటన్‌, 2027 ‌లో జర్మనీ, 2030 లో జపాన్‌ ‌ను అధిగమించి 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారుతుందని సి.ఇ.బి.ఆర్‌ ‌తెలిపింది.

కోవిడ్‌-19  ‌నుండి రెండు దేశాల విరుద్ధమైన రికవరీల కారణంగా 2028 లో చైనా అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని యుకె ఆధారిత థింక్‌ ‌ట్యాంక్‌ అం‌చనా. 2030 ల ఆరంభం వరకు డాలర్‌ ‌పరంగా జపాన్‌ ‌ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మిగిలిపోతుందని అంచనా. కోవిడ్‌ ఆం‌క్షలు క్రమంగా ఎత్తివేసినందున, ఆర్ధికవ్యవస్థ తిరిగి గాడిలో పదినప్పటికీ ఉత్పత్తి   పూర్వం కంటే తక్కువగానే ఉంది. భారతదేశ ఆర్ధిక పునరుద్ధరణకు ఇప్పటివరకు ఒక ముఖ్యమైన చోదక శక్తి వ్యవసాయ రంగం మెరుగైన ఉత్పత్తుల ద్వారా పుంజుకుంది. ఆర్థిక పునరుద్ధరణ వేగం దేశీయంగా అంతర్జాతీయంగా కోవిడ్‌-19 అభివృద్ధికి విడదీయరానంత ముడిపడి ఉంటుందని నివేదిక తెలిపింది.

ప్రపంచంలో మెజారిటీ వ్యాక్సిన్ల తయారీదారుగా, ప్రతి సంవత్సరం 55 మిలియన్ల మందిని లక్ష్యంగా చేసుకునే 42 ఏళ్ల టీకా కార్యక్రమంతో, వచ్చే ఏడాది టీకా ను విజయవంతంగా , సమర్ధవంతంగా విడుదల చేయడానికి  ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారతదేశం ఉన్నత స్థానంలో ఉండడం, మధ్యస్థం నుండి దీర్ఘకాలికంగా, 2016 డీమానిటైజేషన్‌ ‌వంటి సంస్కరణలు, ఇటీవల వ్యవసాయ రంగ సరళీకృత వివాదాస్పద ప్రయత్నాలు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయనిని థింక్‌ ‌ట్యాంక్‌ ‌తెలిపింది.   వ్యవసాయ రంగం  భారతీయ శ్రామికశక్తి  కల్గి ఉన్నందువల్ల సంస్కరణల ప్రక్రియకు సున్నితమైన, క్రమ విధానం అవసరమని, అప్పుడే  స్వల్పకాలిక ఆదాయాలకు మద్దతుతో పాటు, దీర్ఘకాలిక  లాభాలను చేకూరుస్తుందని పేర్కొన్నారు.

dr md
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply