Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు చేయడం ఖాయం

వికారాబాద్‌ : ‌రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, అధైర్యపడవద్దని, ఆందోళన చెందవద్దని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌ అన్నారు. శుక్రవారం ఆయన వికారాబాద్‌ ‌నియోజకవర్గంలోని ధారూర్‌ ‌మండలంలోని మోమిన్‌ ‌కలాన్‌, ‌మోమిన్‌ ‌కుర్ద్, ‌రాజపూర్‌ ‌గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటకు సాగు నీరు, పెట్టుబడికి సాయం, 24 గంటల కరెంట్‌, ‌రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా వంటి అత్యున్నత పథకాలను తీసుకువచ్చిన మహానాయకుడుగా సీఎం కేసీఆర్‌ ‌చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు.

వికారాబాద్‌ ‌జిల్లాని గ్రీన్‌ ‌జోన్‌లోకి తీసుకురావడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేస్తున్నారని, ప్రజలు కూడా అందుకు సహకరించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమికూడకుండా ఉండేందుకు రైతులకు టోకెన్లు ఇచ్చి టోకెన్‌ ‌నంబర్ల ప్రకారం వారినుండి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు రైతులు పండించే పంటను చివరి గింజ వరకు కొనాలని, అందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ఏ ఒక్కరు ఆకలితో అలమటించకుండా వారికి నిత్యావసర వస్తువులు అందేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో ధారూర్‌ ఎం‌పిపి విజయలక్ష్మీ హన్మంత్‌ ‌రెడ్డి, ఎంపీడీవో అమృత, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏపీఎం దేవయ్య, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!