- 1153, 1156 విత్తనాల వినియోగించ వద్దు
- ధాన్యంలో తరుగు లేకుండా చర్యలు
- నరేగాతో ఎస్సారెస్పీ కాలువల రిపేర్లు
- కోవిడ్-19 వైరస్ నియంత్రణ చర్యలు
- సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జిల్లాలోని రైతుల వద్ద నుండి చివరి గింజ వరకు మద్దతు ధరపై ప్ర భుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కోవిడ్ 19, ధాన్యం కొనుగోలు నరేగా నిధుల వినియోగంపై ఆయన గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్, ప్రభుత్వ విఫ్, పెద్దపల్లి ఎంపి, పెద్దపల్లి, రామగుం డం ఎమ్మెల్యేలతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి సమయంలో రైతులు నూతన రకాల విత్తనాలు వాడటం వల్ల పంటలో కొంత మేర తెగులు వచ్చిందన్నారు. జిల్లాలో సుమారు 20% పైగా రైతులు అవే విత్తనాలను వినియోగించడం వల్ల తెగులు సమస్య ఉత్పన్నమవుతుందన్నారు.
పరిష్కారం కొరకు స్థానికంగా రైస్ మిల్లర్లతో సమయ సమావేశాలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వానాకాలం పంటలకు రైతులు మంచి విత్తనాలను వినియోగించేలా, వానాకాలం పంటలు సన్న రకం బియ్యం, ధాన్యం వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. 1153, 1156 విత్తనాలను వాడవద్దని రైతులకు సూచించారు. నాణ్యమైన నాలుగైదు రకాల విత్తనాలు గురించి రైతులకు సమాచారం ఇవ్వాలన్నా రు. ప్యాడి క్లీనర్లను వినియోగించి రైతులు ధాన్యాన్ని 2,3 రోజులపాటు శుభ్రం చేసి తెగులు తొలగించాలన్నారు. నాణ్యమైన ధాన్యంలో ఎలాంటి తరుగు లేకుండా పూర్తి మద్దతు ధరపై కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపడుతున్నారని మంత్రి జిల్లా అధికారలును అభినందించారు. కొరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం మే7 వరకు విధించిన లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి కంటైన్మంట్ జోన్లు లేవని యాక్టివ్ కేసులు కూడా లేవన్నారు. వలస కార్మికులను వారి సొంత ప్రాంతా లకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింద ని, దీనికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను చేపట్టా లని, వైరస్ వ్యాప్తి జరగకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. నరేగను వినియోగిస్తూ ఎస్సారెస్పీ కాలువలను, నీటిపారుదల శాఖ కాల్వల పనులు చేపట్టాల ని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాత్రికేయుల సమా వేశం నిర్వహించి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయా లను వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనా రాయణ, డిసిపి రవీందర్, రామగుండం మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక రావు, రామగుండం మున్సిపల్ కమీషనర్ ఉదయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఆర్డిఓ శంకర్ కుమార్, డిఆర్డిఓ వినోద్ కుమార్, డిఎఓ తిరుమల ప్రసాద్, డిఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్, మెడికల్ సూపరిండెంట్ వాసుదేవరెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.