Take a fresh look at your lifestyle.

మాస్కులు మా దగ్గరే కొనాలి ..!

ధర రు .400…తల్లి తండ్రుల పై ఢిల్లీ పబ్లిక్ స్కూల్  ఒత్తిడి ..

ఓయూ జేఏసీ నాయకులు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మా దగ్గర మాత్రమే మాస్కులు కొనాలని వాటికి 400 కూడా ధర నిర్ణయించి కొనాలని తల్లిదండ్రుల పై ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని  తక్షణమే అలాంటి వాటిని నిలుపుదల చేయాలని అలాంటి స్కూల్ ల పై తక్షణం చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ నేతలు విద్యాశాఖను కోరారు   మరోపక్క నారాయణ శ్రీ చైతన్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ,కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ,కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తూ ఫీజు చెల్లించిన వారు మాత్రమే ఆన్లైన్లో తరగతులకు హాజరు కావాలని హుకుం జారీ చేస్తున్నాయని ,ఓయూ జేఏసీ నేత పాలడుగు శ్రీనివాస్ ఫైరయ్యారు.  తెలంగాణ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు శ్రేయస్కరం కాదని రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో  11 పేపర్లకు వచ్చే నెల మొదటి వారం వరకు పరీక్షలు నిర్వహించడం వల్ల ఆ తేదీ వరకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి, లక్షలాది మంది విద్యార్థుల పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది కావున తక్షణమే పరీక్షలన్నీ రద్దుచేసి, అందరి నీ ఉత్తీర్ణులు గా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని విద్యాశాఖను ఓయూ జేఏసీ నేతలు సోమ గాని కిరణ్ కుమార్ బాబూలాల్ ,పాలడుగు శ్రీనివాస్, వి కే మాదిగ,  మోహన్ లు కోరారు. తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఓఎంఆర్ పద్ధతిలో ఒకే రోజు పరీక్షలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ఉస్మానియా యూనివర్సిటీ విలేకర్ల  సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply