Take a fresh look at your lifestyle.

బండి సంజయ్‌ ‌ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన

పరస్పరం రాళ్ళు రువ్వుకున్న టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల కార్యకర్తలు
టిఆర్‌ఎస్‌ ‌పార్టీపై వ్యతిరేకతను ప్రదర్శించిన రైతులు
అన్ని అడ్డంకులను అధిగమించి రైతులను పరామర్శించిన బండి సంజయ్‌
‌నినాదాలతో హోరెత్తించిన ఇరు పార్టీల నేతలు
అనుమతి లేకుండా పర్యటించారు..బండి సంజయ్‌తో పాటు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశాం : నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ ‌వెల్లడి

బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రెండో రోజు పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన తీవ్ర ఉద్రిక్తతల మధ్యకొనసాగింది. మంగళవారం జిల్లాలోని చివ్వెంల, ఆత్మకూర్‌ ఎస్‌ ‌మండల్లాలో పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బండి సంజయ్‌ ‌బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించే క్రమంలో టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆయన తన పర్యటనను కొనసాగించారు.

బండి సంజయ్‌ ‌పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులు భారీగా మొహరించిన నేపథ్యంలో మొదట చివ్వెంల ఐకేపీ సెంటర్‌ ‌దగ్గరకు చేరుకోగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ జెడ్పీటీసీ సంజీవ్‌ ‌నాయక్‌, ‌మండల పార్టీ అధ్యక్షుడు జీవన్‌ ‌రెడ్డి జిల్లా నాయకులు రామగిరి నగేష్‌, ఆత్మకూర్‌ ఎస్‌ ‌మండలంలో జెడ్పీటీసీ వైస్‌ ‌చైర్మన్‌ ‌గోపాగాని నారాయణ గౌడ్‌ల నేతృత్వంలో బీజేపీ శ్రేణులను అడ్డుకోవడం జరిగింది. రెండు పార్టీల నేతలు రాళ్ళు రువ్వుకోవడం, ఒకరిని ఒకరు తోసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలతో పాటు ఒక కానిస్టేబుల్‌కు తలపై గాయాలయ్యాయి. నెల రోజుల నుంచి ఐకెపి సెంటర్‌ ‌వద్ద తమ వరి ధాన్యాన్ని పోశామని వర్షం కారణంగా ధాన్యాన్ని పట్టాలతో కప్పుతున్నామని రైతులు వాపోతున్నారు. వారి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

ధాన్యం రాష్ట్రం కొనుగోలు చేస్తుందా కేంద్రం కొనుగోలు చేస్తుందో తమకు తెలవదని, తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వారి గోసను బండి సంజయ్‌కి వినిపించారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎన్ని అడ్డంకులు కలిగించినా రైతులను కలవకుండా తమను ఆపలేరని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని సంజయ్‌ ‌హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వొచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతులను తప్పుదోవ పట్టించి కేంద్రంపై ధాన్యం కొనుగోలు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.అనుమతి లేకుండా పర్యటించారు..బండి సంజయ్‌తో పాటు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశాం : నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ ‌వెల్లడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి. రంగనాధ్‌ ‌తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌నేతల ఘర్షణలో పోలీస్‌ ‌సిబ్బందికి గాయాలైనట్లు తెలిపారు.

బండి సంజయ్‌ ‌పర్యటన వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారన్న కారణంతో కేసులు పెట్టినట్లు ఎస్పీ రంగనాధ్‌ ‌ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో అనుమతి తీసుకోకుండా పర్యటించడం సరికాదన్నారు. అనుమతి తీసుకోకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతం, ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా జరిగిన పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులపై, టీఆర్‌ఎస్‌ ‌నాయకులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ రంగనాధ్‌ ‌తెలిపారు. బండి సంజయ్‌ ఐకెపి కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించే క్రమంలో జరిగిన ఘర్షణల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జీ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడం కారణంగా సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్‌ ‌పర్యటన కోసం జిల్లా యంత్రాంగం నుంచి కానీ, పోలీస్‌ ‌శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. బండి సంజయ్‌ ‌నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం చివరి నిమిషంలో లేఖ ఇచ్చారన్నారు. నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకెపి కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నదని, ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వొచ్చిందని పేర్కొన్నారు. బండి సంజయ్‌ ‌కాన్వాయిపై సైతం రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

Leave a Reply