Take a fresh look at your lifestyle.

బండి సంజయ్‌ ‌పాదయాత్ర.. తెలంగాణలో బిజెపి అధికారానికి మలుపు

“టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఉన్న 100 మంది ఎమ్‌ఎల్‌ఏ ‌లలో దాదాపు 75 మంది ఎంఎల్‌ఏ ‌లు భూ అక్రమాలు,భూకబ్జాలు చేస్తున్నారంటే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేస్తున్న అవినీతికి నిదర్శనం తప్ప మరోటి కాదు, గ్రానైటు క్వారీల విషయంలో మొదటి నుండి చట్టబద్ధంగానే పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చిన్న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ ‌కు చెందిన శ్వేత కంపెనీలో భారీగా అక్రమాలు బయటపడి దాదాపు 360 కోట్లు శ్వేత కంపెనీ నుండి వసూలు చేయ్యలని గనుల శాఖకు ఈడీ ఆదేశాలు జారి చేశాయంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు,ఎమ్‌ఎల్‌ఎలకు అడ్డు అదుపు లేకుండా అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందని అర్థం అవుతుంది,ఇటువంటి అవినీతి, అక్రమాలను ప్రజలలోకి తీసుక వెళ్ళడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌పాదయాత్ర వేదిక కాబోతుంది.”

బండి సంజయ్‌ ‌కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షు లుగా ఎన్నికైన నాటి నుండి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ,ప్రజలలో కూడా టీఆర్‌ఎస్‌ ‌కు బిజెపినే ప్రత్యామ్నాయ పార్టీ అని ప్రజలలోకి తీసుక వెళ్ళడంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ విజయవంతం అయింది. బండి సంజయ్‌ ‌తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విసృతంగా పర్యటిస్తూ తాను సొంతంగా తన క్యాడర్‌ ‌ను పెంచుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గం, ఇటువైపు కేటీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గం,మరో ప్రక్క హరీష్‌ ‌రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట నియోజకవర్గాల మధ్య టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వెన్న ముక్కలాగా ఉన్నటువంటి దుబ్బాక నియోజక వర్గంలో బిజెపి పార్టీ విజయ దుందుభి మ్రోగించడంతోనే అర్థం అయింది తెలంగాణలో బిజెపి తిరుగులేని శక్తిగా అవతరించిందని,ఈ విజయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పార్టీ శక్తిని, బిజెపి పార్టీ బలాన్ని చాటాడమే కాకుండా , ఆ తదనంతరం జరిగిన జీహెచ్‌ఎమ్సీ ఎన్నికల్లో కనీవినీ ఎరగని రీతిలో4 స్థానాల నుండి 48 స్థానాలు గెలుచుకున్నారు అంటే బిజెపి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని తెలంగాణ ప్రజలకు అర్థం అయింది.

అంతకంటే ముందు 2019 లో జరిగిన లోక్‌ ‌సభ ఎన్నికలలో ఎప్పుడు లేనంతగా భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు స్థానాలు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా అవినీతిని పారద్రోలాలని తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకున్నారు,ఈ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసే అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవినీతి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌పాదయాత్ర నిలయం కాబోతుంది.

ఆగస్టు 24 న హైదరాబాదులోని భాగ్య లక్ష్మీ దేవాలయం దగ్గర ప్రారంభం అయ్యే బండి సంజయ్‌ ‌పాదయాత్రలో కేసీఆర్‌,‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన టువంటి మోసపూరితమైన వాగ్దానాలు ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే దళిత నాయకుడు తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి ఉంటాడని,కేజీ నుండి పీజీ ఉచిత విద్య, దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలందరికీ డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ల నిర్మాణం లాంటి ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి రాష్ట్ర శాఖ భావిస్తుంది,అంతే కాకుండా కేంద్రంలో నరేంద్ర మోడి నాయకత్వం అందిస్తున్న ప్రజల పాలన, సమర్థవంతమైన పరిపాలనతో పాటు నరేంద్ర మోడి ప్రభుత్వం అందిస్తున్నఅద్భుతమైన, సాహసోపేత నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు వివరిస్తూ తెలంగాణలో బిజెపి ఎదురులేని శక్తిగా మారడానికి చిరునామాగా నిలువ బోతుంది.

యావత్‌ ‌భారతదేశానికి ఆగస్టు 15 1947 న స్వాతంత్రం వచ్చి భారతదేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంటే తెలంగాణ ప్రాంతం మాత్రం సంబరాలు చేసుకోలేకపోయింది ఎందుకంటే తెలంగాణ ప్రాంతం మొత్తం నిజాంల ఆధీనంలో ఉండేది,ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించిన అప్పటి భారత దేశ ఉప ప్రధాని సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌చొరవతో హైదరాబాద్‌ ‌సంస్థానం నిజాంల పాలన నుండి విముక్తి చేశారు, భారతదేశానికి ఆగస్టు 15 1947 లో స్వాతంత్య్రం వస్తే, సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌కృషితో హైదరాబాద్‌ ‌సంస్థానానికి (ప్రస్తుత తెలంగాణ ప్రాంతానికి)సెప్టెంబర్‌ 17 ‌న స్వాత ంత్య్రం వచ్చింది, అందుకే తెలంగాణకు సెప్టెంబర్‌ 17 ‌న నిజమైన స్వాతంత్రం వచ్చిన ందుకు ఈ తెలంగాణ విమోచన దినంను నాడు కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్నపుడు,నేడు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి పార్టీ మొదటి నుండి డిమాండ్‌ ‌చేస్తుంది,బండి సంజయ్‌ ‌పాదయాత్ర లో ప్రధానంగా సెప్టెంబర్‌ 17 ‌ను తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలో తెలంగాణ విమోచన దినంను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇప్పుడు ఎందుకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంను అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

రెండవ అంశం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి,అక్రమాలు గురించి, తెలంగాణ రాష్ట్రాని పూర్తిగా అప్పుల రాష్ట్రంగా మార్చే విధంగా కేసీఆర్‌,‌టీఆర్‌ఎస్‌ ‌కుటుంబం అవినీతి అనకొండ గా మారి సాగునీటి ప్రాజెక్టుల పేర్లు చెప్పి తరుచుగా ప్రాజెక్టుల డిజైన్‌ ‌లు మార్చి వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకుంటుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఉన్న 100 మంది ఎమ్‌ఎల్‌ఏ ‌లలో దాదాపు 75 మంది ఎంఎల్‌ఏ ‌లు భూ అక్రమాలు,భూకబ్జాలు చేస్తున్నారంటే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేస్తున్న అవినీతికి నిదర్శనం తప్ప మరోటి కాదు, గ్రానైటు క్వారీల విషయంలో మొదటి నుండి చట్టబద్ధంగానే పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చిన్న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ ‌కు చెందిన శ్వేత కంపెనీలో భారీగా అక్రమాలు బయటపడి దాదాపు 360 కోట్లు శ్వేత కంపెనీ నుండి వసూలు చేయ్యలని గనుల శాఖకు ఈడీ ఆదేశాలు జారి చేశాయంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు,ఎమ్‌ఎల్‌ఎలకు అడ్డు అదుపు లేకుండా అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందని అర్థం అవుతుంది,ఇటువంటి అవినీతి, అక్రమాలను ప్రజలలోకి తీసుక వెళ్ళడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌పాదయాత్ర వేదిక కాబోతుంది.

మూడవది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలన గురించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావించి తెలంగాణ కోసం అన్ని రంగాల వారు పోరాటం చేశారు, అందులో విద్యార్థుల పాత్ర చాలా కీలకం, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ,ఉద్యోగ అవకాశాలు లేక యువత అల్లాడుతుంటే కేసీఆర్‌ ‌కుటుంబంలో మాత్రం కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి, కొడుకు కేటీఆర్‌,అల్లుడు హరీష్‌ ‌రావు లు మంత్రులుగా, సడ్డకుని కొడుకు పార్లమెంటు సభ్యుడిగా, కూతురు ఎమ్‌ఎల్సీ గా ఉన్నారు, ఒకవైపు బంగారు తెలంగాణను చేస్తామని కేసీఆర్‌ ‌చెప్పి నేడు తన కుటుంబాన్ని బంగారు కుటుంబం గా మార్చుకున్నారు. బండి సంజయ్‌ ‌పాదయాత్రలో భారీ స్థాయిలో అనేక మంది నాయకులు,కార్యకర్తలు బిజెపి లో చేరడమే కాక, బూత్‌ ‌స్థాయి, గ్రామ స్థాయిలో బిజెపి పార్టీని సంస్థా గతంగా అభివృద్ది చేసి వచ్చే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అధికార ంలోకి రావడం ఖాయం.
– దుగ్యాల ప్రదీప్‌ ‌కుమార్‌,
‌బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Leave a Reply