Take a fresh look at your lifestyle.

మార్చి 6 నుంచి.. శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలు

  • ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారించిన ఆర్థిక మంత్రి హరీష్‌రావు
  • వాస్తవిక ధృక్పథంతో బడ్జెట్‌ అం‌చనాలు 

13 municipalities, seats wonjoint districts, minister Harish Rao, narayan kahd

మార్చి 6 నుంచి శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదివరలో మార్చి మొదటివారంలో శాసనసభ సమావేశాలు జరుపాలని నిర్ణయించారు. మొదటిరోజున గవర్నర్‌ ‌ప్రసంగం తర్వాత రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీర్‌హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థికమంత్రి వివిధశాఖల అధికారులతో మంత్రులతో సమీక్షా సమావేశాలు జరిపారు. ఆర్థికక్రమశిక్షణ ఆవశ్యకత గురించి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ‌వివిధశాఖల పద్దులపైన ముఖ్యకార్యదర్శులతో సమావేశాలను నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికలు , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు వంటి వరుస ఎన్నికలు జరిగినందున శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలు ఆలస్యమైనట్లు తెలిసింది.మార్చి 26 న రాజ్యసభ ఎన్నికలు జరుగన్నుందున, ఈ ఎన్నికల తేదీలు కలిసివచ్చేవిధంగా సమావేశాలు జరుగనున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తన్నది. వాస్తవిక ధృక్పథంతో అంచనాలు ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులకు సమీక్షా సమావేశాల్లో సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జరిపిన సమీక్షలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకప్రధానకార్యదర్శి రాజేశ్వర్‌‌త్రివారీ, ప్రభుత్వ ప్రత్యేకప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ‌తమ శాఖలకు సంబంధించి చాలా సూచనలు ఇచ్చారు. బడ్జెట్‌ ‌మార్గదర్శకాల ప్రకారం ఉండాల్సిన కేటాయింపుల నిష్పత్తులపైన చర్చించారు. కాగా దేశంలోనే 30శాతం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ ‌కేటాయిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు లభించింది. ఈ పేరును సార్థకం చేసుకునేవిధంగా వ్యవసాయరంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారా? లేదా? అనే అంశాలు చర్చనీయాంశాలయ్యాయి. జీఎస్‌టీ ఆదాయం కేంద్రంతో పోల్చినట్లయితే 19శాతానికి పెరిగిందని రాష్ట్ర ఆర్థికశాఖ నివేదికలను తెలియచేస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకుముందు సీఎం ఓట్‌ఆన్‌అకౌంట్‌ ‌బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత సెప్టెంబర్‌లో జరిగిన  సమావేశాలో పూర్తిస్థాయి లోబడ్జెట్‌న్‌‌ ప్రతిపాదించారు.

సెప్టెంబర్‌ -9-2019‌న సీఎం బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టారు.. గ్రామపంచాయతీ ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల తర్వాత జరిగిన విలేకరుల సమావేశాల్లో పన్నులు ఉంటాయని సూచనలు చేశారు.అయితే పెంచనున్న పన్నులపైన ప్రతిపాదనలు ఉండే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా కొత్తగా భారీ అంచనాలతో ఉండే కొత్త పనులకు, ప్రాజెక్ట్‌లకు అవకాశాలు ఉండవని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇప్పటికే 90శాతం పనులు పూర్తయిన పనులకు మిగతా 10శాతం నిధులు కేటాయించి చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేపే దిశలో ప్రభుత్వ వర్గాల ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. అయితే గతేడాది సమర్పించి ఓట్‌ఆన్‌అఔం‌ట్‌ ‌బడ్జెట్‌లో 1.82లక్షలకోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా సెప్టెంబర్‌ -2019‌లో సమర్పించిన సవరించిన బడ్జెట్‌లో 1.48కోట్లు ప్రతిపాదించారు. కేంద్రం నుంచి ఆదాయవనరులు రాకపోవడం, రాష్ట్ర ఆదాయం అనుకున్నంత స్థాయిలో పెరగకపోవడం, ఖర్చులు పెరగడం వంటి కారణాలతో బడ్జెట్‌ ‌ప్రతిపాదనలు తగ్గాయని రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టం చేశారు. మంత్రులతో జరిగిన చర్చలలో కూడా ఆర్థిక మంత్రి ఆదాయవనరులకు పరిగణనలోకి తీసుకొని వాస్తవ ధృక్పథంతో ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. 2014 నుంచి 2018 వరకు జరిగిన శాసనసభ సమావేశాల్లో ్ప ప్రతిపక్షం ఎన్నిరోజులు కోరితే అన్నీ రోజులు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పే వారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సమావేశాలు మాత్రం పదిరోజులు మాత్రము నడిచాయి. ఈ సారి మార్చిలో జరిగే సమావేశాలు కూడా పదిహేనురోజులకన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు లేవని చర్చ జరుగుతున్నది.

Leave a Reply