Take a fresh look at your lifestyle.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ 31 ‌నుంచి బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభం

Budget sessions begin on February 1 from the Union Budget 31
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టేందుకు కసరత్తు మొదలయ్యింది. నిర్మలా సీతారామన్‌ ‌నేతృత్వంలో హల్వా పాకం చేపట్టే కార్యక్రమం ప్రారంభించారు. బడ్జెట్‌పై ఇప్పటికే కసరత్తు చేపట్టిన నిర్మల ఈ యేడు ఎలాంటి మెరుపులు మెరిపిస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీన బ్జడెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నెల 31 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాంగగా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ‌ప్రవేశ పెడతారు. బడ్జెట్‌ ‌కోసం కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈసారి బ్జడెట్‌లో రైతులు, మధ్య తరగతి ప్రజల కోసం పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

వ్యవసాయ రంగంలో రైతులకు ఉపయోగపడేలా, వారికి ఆదాయం పెరిగేలా పథకాలు ప్రవేశపెట్టొచ్చని భావిస్తున్నారు. అలాగే ఆదాయపన్ను పరిమితిని కూడా పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఆర్థిక మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలపై అందరి చూపు ఉంది. 2016 వరకు బ్జడెట్‌ను ఫిబ్రవరి నెల చివరి పనిదినం రోజున ప్రవేశపెట్టేవారు. కానీ 2017 నుంచి జైట్లీ ఆ సంప్రదాయాన్ని మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీన బ్జడెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే ప్రధాని కూడా ఓ మారు ఆర్థికవేత్తలతో చర్చించారు. శాఖల వారీగా నిర్మలా సీతారామన్‌ ‌కూడా బడ్జెట్‌పై కసరత్తు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply