Take a fresh look at your lifestyle.

ఈ ‌నెల మూడోవారంలో బడ్జెట్‌ ‌సమావేశాలు?

From today .. Budget sessions of Parliament

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల మూడో వారంలో శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలు జరుగనున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇప్పటికే బడ్జెట్‌ ‌కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్‌ ‌సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసినా సహకార ఎన్నికలు ఉండడం,ప్రస్తుతం మేడారం జాతర జరుగుతుండడంతో మూడో వారం వరకు అన్నీ పూర్తవుతాయి. ఆ సమయంలో బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టడానికి అందరికీ అనుకూలంగా ఉంటుందని కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు తమవంతుగా ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఆర్థికమంత్రి హరీష్‌ ‌రావు కూడా బడ్జెట్‌ ‌కసరత్తులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 1న పార్లమెంటులో బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టడంతో కేటాయింపుల స్వరూపం తేలిపోయింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయం తేలిపోయింది. ఆచితూచి వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పించేందుకు వీలుగా సమావేశాలకు సిద్ధమవుతున్నది. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనోద్యమాలు వెల్లువెత్తుతున్న సందర్భంలో మూడో వారంలో జరుగనున్న శాసనభ సమావేశాలలో ఈ అంశం చర్చనీయాంశం కానున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలలో విజయఢంకా మోగించిన తరువాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ ‌సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనభలో తీర్మనం చేస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలో ఈ సమావేశాలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. జీఎస్టీ బకాయిల కోసం సీఎం కేసీఆర్‌ ‌కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు.

లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ‌పక్షనేత నామా నాగేశ్వరరావు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో జీఎస్టీ బకాయిల గురించి ప్రశ్నించరు. పదిహేనో ఆర్థిక సంఘం నుంచి ఆశిస్తున్న నిధుల గురించి సిఫార్సుల గురించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇటీవల పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ను కలసి ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి, నీతి ఆయోగ్‌ ‌సిఫార్సులు చేసినట్లుగా మిషన్‌ ‌భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. జనవరి 13న ఏపీ సీఎం జగన్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌లో ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇద్దరు రాష్ట్ర అగ్ర నేతల సమావేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన రూ. 400 కోట్ల నిధులు నిలచిపోయాయి. ఈ బడ్జెట్‌ ‌సమావేశంలో ఈ అంశాలన్నీ చర్చనీయాంశం కానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలన్నీ ఆర్టీసీ సమ్మె, మున్సిపల్‌ ఎన్నికలలో ఎక్స్ అఫీషియో వోటును అధికార పార్టీ వినియోగించుకున్న విధానంపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలున్నాయి.

Leave a Reply