Take a fresh look at your lifestyle.

నేటి నుంచి బడ్జెట్‌ ‌సమావేశాలు

నేటి నుంచి శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ ‌బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణ ఉభయ సభల నుద్ధేశించి ప్రసంగించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభంకాగానే గవర్నర్‌ ‌ప్రసంగిస్తారు. గతేడాది సెప్టెంబర్‌ ‌తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్‌ ‌ప్రసంగలో పొందుపరిచినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ రంగంలో, నీటిపారుదల రంగంలో , గురుకుల పాఠశాలల ఏర్పాటులో పల్లెప్రగతి, పట్టణప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా సాధించిన ఫలితాలను ఈ ప్రసంగంలో ఉదహరించనున్నారు. ప్రత్యేకంగా బడ్జెట్‌ ‌సమావేశాలు కావడం వల్ల రాష్ట్ర వృద్ధిరేటును రేఖామాత్రంగా ఉదహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జాతీయ వృద్ధి రేటుతో పోల్చినట్లయితే తెలంగాణ వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నదని ఆర్థికశాఖ అంచనాలు తెలియచేస్తున్న నేపథ్యంలో వృద్ధిరేటు వివరణలు గవర్నర్‌ ‌ప్రసంగంలో ఉంటుందని అంటున్నారు. శాసనసభ సమావేశాలు సజావుగా జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతా చర్యలను సమీక్షించారు. భద్రతాచర్యలలో భాగంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 వ సెక్షన్‌ ‌ముందుజాగ్రత్త కోసం అమలులోకి తెచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

కాగా కాళేశ్వరం జలాలు తూర్పు తెలంగాణలోని మారుమూల గ్రామాలకు ప్రవహించడం, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ ‌మండలంలోని చిన్న చిన్న చెరువులు కూడా గోదావరి జలాలతో నిండిపోవడం ప్రస్తావించనున్నారు. పల్లెప్రగతికోసం ప్రతి నెల పంచాయతీరాజ్‌ ‌శాఖకు రూ.319 కోట్లు కేటాయిస్తున్న విషయాలను, పట్టణాల ప్రగతికోసం ప్రతీనెల రూ2వేలకోట్లు కేటాయిస్తున్న సందర్భాన్ని ఉదహరించనున్నారు. వ్యవసాయరంగంలో అనూహ్యంగా ఉత్పత్తులు పెరగడం, కందులు రికార్డు స్థాయిలో 2లక్షల క్వింటాళ్ల వరకు ఉత్పత్తి కావడం, అదేవిధంగా వరిధానాన్యాన్ని గత ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా కొనుగోలు చేయడం, మార్కెఫెడ్‌, ‌పౌరసరఫరాలశాఖల ద్వారా కొనుగోలు చేయడం వంటి విజయాలను ప్రస్తావించనున్నారు.ఈ వరుసలోనే రాష్ట్ర ఆర్థిక మంత్రి రెండోసారి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన తన్నీర్‌హరీశ్‌రావు తొలిసారి 8న బడ్జెట్‌ ‌సమర్పించారు. ఆయన బడ్జెట్‌లపైన తెలంగాణ రైతులలలో ఎక్కువ ఆశలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply