Take a fresh look at your lifestyle.

బడ్జెట్ సమావేశాలు అద్భుతం..!

  • శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి ప్రకటన

ఈ బడ్జెట్ సమావేశాలు అద్భుతంగా జరిగాయి..బడ్జెట్ ను పాస్ చేసుకోవడమే కాకుండా.. ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు చర్చకు వచ్చాయని సమావేశాల ఆఖరి రోజు సోమవారం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ప్రకటన విడుదల చేసారు.ప్రకటన పూర్తి పాఠం..ఎన్నడూ లేని విధంగా 40 పద్దులపై 36 మంది సభ్యులు చర్చలో పాల్గొనడం ఆహ్వానించదగ్గ పరిణామం..స్పీకర్ గారు పార్టీలకు అతీతంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లో అవకాశం ఇవ్వడం వల్ల సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ నియోజకవర్గ, ప్రాంత సమస్యలను ప్రస్తావించడం జరిగింది.

100 మంది సభ్యులు ఉన్న సభనాయకుడు కేసీఆర్ గారు సభలో 5 గంటల 58 నిమిషాలు మాట్లాడితే…
7గురు సభ్యులు ఉన్న ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు 3 గంటల 34 నిమిషాలు మాట్లాడారు.6 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు 3 గంటల 29 నిమిషాలు మాట్లాడారు.ఒకే ఒక్క సభ్యుడున్న బీజేపీ పార్టీ రాజసింగ్ గారు 54 నిమిషాలు మాట్లాడారు. దీన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలు ఎంత ప్రజాస్వామ్య పద్దతిలో జరిగాయో తెలుస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపక్షాలకు ఇచ్చే గౌరవం, విలువను ఈ సందర్భంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.

కరోన వైరస్ నేపథ్యంలో సభను కుదించుకోవడం వల్ల,సభ మొత్తం 8 పనిదినాలే నడిచినప్పటికీ,48 గంటల 41 నిమిషాలు నాణ్యమైన పనిగంటలు నడిచింది.సభ రూల్స్ ప్రకారం రోజు 4 గంటలు మాత్రమే సభ నడవాల్సి ఉన్నా…8 రోజుల్లో యావరేజ్ గా రోజు 6 గంటల చొప్పున సభ నడిచింది.15 రోజులు సభ నడిచినా ఇన్ని పనిగంటలు నడవని సందర్బాలు చాలా ఉన్నాయి.సభా సజావుగా నడిపిన స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్ గారికి మరియు సహకరించిన అన్ని పక్షాల నాయకులకు,విప్ లకు,సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసారు.

Leave a Reply