Take a fresh look at your lifestyle.

ఒక్కరోజులో ముగించిన చరిత్ర లేదు

బడ్జెట్‌ ‌సమావేశాల తీరు అవమానకరం: బుచ్చయ్య

రాజమండ్రి, : అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ఒక్కరోజులో ముగించడం దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేదని, ఎపిలోనే ఇలాంటి పరిస్థితిని చూస్తున్నామని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బడ్జెట్‌పై చర్చించి, సమస్యలను విశ్లేషించాలన్న ఆలోచన చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం 15 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు నడపలేదని.. అసెంబ్లీ సమావేశాలు కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా సెకెండ్‌ ‌వేవ్‌పై ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని విమర్శించారు. కేవలం ప్రభుత్వంపై విమర్శలు రాకుండా ఉండేందుకే మమ అనిపించారని అర్థం అవుతోందని అన్నారు. అసెంబ్లీ పెడితే టిడిపి నుంచి గట్టి విమర్శలు వస్తాయన్న భయం కూడా ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా పోలీస్‌ ‌వ్యవస్థ అప్రతిష్ట పాలు అవుతుందన్నారు. చట్ట సభలను చెత్త సభలుగా మార్చారన్నారు. నయా హిట్లర్‌ ‌జగన్‌ ‌ప్రజలపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని అన్నారు. నియంతలు కాలగర్భంలో కలిసిపోతారని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ ‌కూడా సభ్యులపై అరుస్తున్నారన్నారు. మాక్‌ అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యలపై చర్చిస్తామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. రెండు లక్షల యాక్టివ్‌ ‌కేసులుంటే ఎన్ని బెడ్లు ఏర్పాటు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఆర్డినెన్సుతో బ్జడెట్‌ ‌నడపటం ఏంటని ప్రశ్నించారు. సమావేశాల్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవటం వల్ల బడ్జెట్‌ ‌సమావేశాలు బహిష్కరించామని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా చట్టసభలు ప్రజలకు ఉపయోగ పడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగటం లేదని మండిపడ్డారు ధాన్యం ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. ఇసుక విధానం సరిగ్గా లేక భవన కార్మికులు రోడ్డున పడ్డారని, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడానికి మైక్‌ ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్లలో రెండు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ‌కేసుల నుంచి బయటపడటానికి రాష్ట్ర సంపదను గుజరాత్‌కు దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. బలహీన, దళిత వర్గాల వారికి బ్జడెట్‌లో ప్రాధాన్యత ఇవ్వటం లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెంటిలేటర్లు, బెడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బ్జడెట్‌ ‌సమావేశాలు ఒక్క రోజు ఐదు గంటల సేపు మాత్రమే ఉంటుందని…ఈ ఐదు గంటల సమయంలో మాట్లాడానికి అవకాశం ఇవ్వరని, అందుకే బ్జడెట్‌ ‌సమావేశాలకు హాజరుకాలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సలహాదారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యంనకు సంబంధించిన రైతులకు డబ్బులు ఇవ్వలేదన్నారు. అందరికీ మాస్క్‌లు ఎప్పుడు పంపిణీ చేస్తారని నిలదీశారు.

Leave a Reply