Take a fresh look at your lifestyle.

సహాయం అడిగితే రశీదులు అడుగుతున్నారు

బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు డా.అర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌

‌బూర్గంపాడు, ప్రజాతంత్ర ఆగస్టు 01 : ఇటీవల గోదావరి వరదల్లో చిక్కుకుని ముంపుకు గురైన గ్రామాలను బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌సందర్శించారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు బాధిత ప్రజలకు తక్షణ సాయంగా పది వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి,పది పైసలు కూడా ఇప్పటివరకుఇవ్వలేదని విర్శించారు.ముంపుకు గురైన వారిని లెక్కించే పేరుతో అధికారులు ఇళ్ళు,కరెంటుపన్ను చెల్లించిన రశీదులు చూపించమని అడగడం దారుణమన్నారు. ఉరికి ఊరు వరదల్లో మునిగినపుడు రశీదులు ఎక్కడ ఉంటాయని ప్రశ్నించారు.ప్రతికుటుంబానికి 25 కిలోల బియ్యంఉచితంగా ఇస్తామని ప్రకటించి చాలామందికి ఇవ్వలేదని,అడిగిన వారిని రేషన్‌ ‌కార్డు తీసుకు వస్తేనే ఇస్తామనడం అన్యాయమన్నారు. గ్రామం మొత్తం కొట్టుకుపోయిన విషయం అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు.కేవలం మొక్కుబడిగా మత్రమే వచ్చి చూసి వెళ్ళిన సిఎం, పేదలను మరిచి వెళ్ళి ఢిల్లీలో తిరుగుతుండగా,మిగిలిన మంత్రులు కబ్జాల్లో మునిగిపోయారని తెలిపారు.

పంటనష్టం జరిగిన రైతులను ఆదుకోవడం గురించి ప్రభుత్వానికి నోటమాట రావడం లేదన్నారు. అత్యాధునిక పద్దతులననుసరించి డ్రాగన్‌ ‌ఫ్రూట్‌ ‌పంటను  25 లక్షల పెట్టుబడి పెట్టి పండిస్తే, వరదల్లో కోట్లుకుపోతే,ఆదుకోవాల్సిన ప్రభుత్వం ముఖంచాటేయడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం జరిగిన రైతులకు భీమా వర్తింప జేయాలని డిమాండ్‌ ‌చేశారు.అంతే కాకుండా వరదల్లో చిక్కుకుని మరణించినవారి కుటుంబాలను కూడా ప్రభు త్వం ఆదుకోవాలనిడిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ ప్రభుత్వం నెరవేరని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.పూర్తిగా నిరాశ్రయులైన పేదలను ప్రభుత్వం శత్రువులుగా చూస్తున్నదని పేర్కోన్నారు.పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇలాంటి గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయని,అందుకేతక్షణమే ముంపు గ్రామాల ప్రజలకు శాశ్వతపరిష్కారం చూపే విధంగా వారికి ఎత్తైన ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని వెంటనే అందజేయాలని డిమాండ్‌ ‌చేశారు.బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.అనంతరం బూర్గంపాడులో జరుగుతున్న విఆర్‌ఏల నిరవధిక సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు.

బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.ప్రస్తుతం ఇళ్ళు లేని నిరుపేదలకు బిఎస్పి శ్రేణులు తోడుగా ఉండి సహాయం అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  బహుజన సమాజ్‌ ‌పార్టీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్‌, ‌జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్‌ ‌దొర, జిల్లా కార్యదర్శి నియోజకవర్గ ఇన్చార్జి కెవి రమణ, జిల్లా కార్యదర్శి పాక వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు ఇరప రవికుమార్‌ ,‌మండల అధ్యక్షుడు ఇసంపల్లి నరహరి, జిల్లా ఇన్చార్జి కామరాజు, ఈసీ మెంబర్‌ ‌కేసు పాక కృష్ణ ,భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షుడు వీరస్వామి, ఇల్లెందు నియోజకవర్గ అధ్యక్షులు ప్రతాప్‌, ‌కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు నాగుల రవికుమార్‌, ‌మణుగూరు మండల అధ్యక్షుడు నల్లగట్ల రఘు, అశ్వాపురం మండల అధ్యక్షులు రంగబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply