Take a fresh look at your lifestyle.

ముర్ముకే వోటేస్తామన్న బిఎస్పీ చీఫ్‌ ‌మాయావతి

ద్రౌపది ముర్ముకు పెరుగుతున్న మద్దతు
అనేక రాష్ట్రాల్లో బిజెపికి అనుకూల వాతావరణం

లక్నో, జూన్‌ 25 : ‌రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్‌ ‌మాయావతి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి వోట్లు వేస్తారని చెప్పారు. ‘ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయిం చామన్నారు. అయితే తాము బీజేపీకి గానీ, ఎన్డీయేకి గానీ మద్దతు ఇవ్వడంలేదని కూడా స్పష్టం చేశారు. అలాగని ప్రతిపక్షాలకూ వ్యతిరేకం కాదు. పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం’ అని మాయావతి చెప్పారు. మద్దతు అంశంపై ప్రతిపక్షలు తమను సంప్రదించలేదని వెల్లడించారు. కాగా, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ఇక రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహి ంచనున్నారు. ముర్ముకి ఇప్పటికే ఎన్డీయే పక్షాలు కాకుండా బిజూ జనతాదళ్‌, ‌వైఎస్‌ఆర్‌సీపీ, ఛత్తీస్‌గఢ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ ‌జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్‌ ‌ఛత్తీస్‌గఢ్‌(‌జే) వంటి పార్టీలు మద్దతు పలికాయి. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగునున్నాయి.

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ ‌సిన్హా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన నాయకురాలు, జార్ఖండ్‌ ‌మాజీ గవర్నర్‌ ‌ద్రౌపది ముర్మును బీజేపీ ఖరారు చేయడం ప్రతిపక్షాలను ఆం దోళనకు గురిచేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ ‌సిన్హాను విపక్షాలు ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. కానీ బీజేపీ ద్రౌపదిని తెరపైకి తేవడంతో పలు పార్టీల్లో చీలిక వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి. ముర్ము అభ్యర్థిత్వం పై ప్రధాని చరించగానే ఒడిసా సీఎం, బీజేడీ అధినేత నవీన్‌ ‌పట్నాయక్‌ ‌బేషరతు మద్దతు ప్రకటించారు. ఆదివాసీ పార్టీ, యూపీఏ భాగస్వామి జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా(జేఎంఎం) సైతం మద్దతు ఇచ్చింది. ద్రౌపదిలాగే ఆ పార్టీ అధినేత, సీఎం హేమంత్‌ ‌సోరెన్‌ ‌సంతాలీ గిరిజన తెగకు చెందినవారు. పైగా ఆమె ఆరేళ్లకుపైగా జార్ఖండ్‌ ‌గవర్నర్‌గా పనిచేశారు. జేఎంఎం ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ ఎస్టీలే. పార్టీ ఆమెకు మద్దతివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందుతుందన్నది హేమంత్‌ ‌భయం.

15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ ‌గ్దదెనెక్కిన ఛత్తీసగఢ్‌ ‌జనాభాలో 30 మంది ఎస్టీలే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ గిరిజనులు 21శాతం ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌.. ‌ద్రౌపదికి మద్దతివ్వకపోతే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గిరిజన బెల్టులో ఆధిక్యం సాధిస్తుందని ఆందోళన చెందుతోంది. రాజస్థాన్‌లోనూ 13.5 శాతం మంది గిరిజనులు ఉన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనూ గిరిజన జనాభా 14 శాతం ఉంది.త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. మొత్త్మద ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దరిదాపుగా రాజకీయ పార్టీలన్నీ గిరిజనులపై దృష్టి సారించక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ద్రౌపదికి అవకాశమివ్వడంతో ఒడిషా, జార్ఖండ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌గుజరాత్‌ ‌సహా పలు రాష్టాల్ల్రో బిజెపికి లబ్ది చేకూరుతుందని అగ్రనేతలు అంచనా వేశారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply