Take a fresh look at your lifestyle.

తమిళనాడు పర్యటనలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 10 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్‌ ‌సర్జ నిర్మించిన హనుమాన్‌ ‌దేవాలయాన్ని శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న కవితకు అర్జున్‌ ‌దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత డియాతో మాట్లాడారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్‌ ‌దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్‌ ‌కు కవిత అభినందనలు తెలిపారు.

చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని అన్నారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్క•తి, భాష, చరిత్ర, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు.

Leave a Reply