Take a fresh look at your lifestyle.

ఇం‌టింటికీ మంచినీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌దే

సంగారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి6: రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానిదేనని రాష్ట్ర, ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్‌ ‌చేరని అన్నారు.శుక్రవారం సంగారెడ్డి జిల్లా పఠాన్‌చేరు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల పంపిణీలో పాల్గొని లబ్దిదారులనుద్ధేశించి మాట్లాడారు.   రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్‌ ‌చెరు అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌ ‌చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన 738 మంది లబ్దిదారులకు జీవో58 ద్వారా మంజూరైన ఇండ్ల పట్టాలను మంత్రి హరీష్‌ ‌రావు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డి,  టీఎస్‌ఎంఐడీ ఛైర్మెన్‌ ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌, ‌మెదక్‌ ఎం‌పీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌శరత్‌ ‌కుమార్‌ ‌పాల్గొ?న్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తి పారదర్శకతతో పట్టాల పంపిణీకి కృషిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. జిల్లాలో 830 మందికి జీవో నంబర్‌ 58 ‌ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్న హరీష్‌ ‌రావు… నేటి నుండి ఇక్కడి ప్రజలు ఇంటి యాజమానులుగా మారారని చెప్పారు. ఇంటింటికి రక్షిత మంచినీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. పేదల కోసం రాష్ట్రంలోనే అత్యధికంగా పటాన్‌ ‌చెరు నియోజకవర్గంలో 13 బస్తీ దావఖానాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

రాబోయే నెల రోజుల్లో జీవో నంబర్‌ 59 ‌ద్వారా ఇళ్ల పట్టాలు అందిస్తామని హా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గారిని, బీఆర్‌ఎస్‌ ‌పార్టీని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని హరీష్‌ ‌రావు చెప్పారు. జిల్లాలో 830 మందికి జీవో నంబర్‌ 58 ‌ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు.పేదల కోసం రాష్ట్రంలోని అత్యధికంగా పటాన్‌చెరు నియోజకవర్గం లో 13 బస్తీ దవఖానాలను ఏర్పాటు చేశానని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను,బీఆర్‌ఎస్‌ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి, టీఎస్‌ఎం ఐసీ చైర్మన్‌ ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply