Take a fresh look at your lifestyle.

అన్న కొడుకే హంతకుడు ఇన్సూరెన్స్ ‌కోసమే అడిన నాటకం

Brother son is a murderer A play for insurance
విలేకరులతో మాట్లాడుతున్న పోలీసులు

తాడ్వాయి గ్రామానికి చెందిన మంజుల సైదులు జనవరి 24న 65జాతీయ రహదారి సర్వీస్‌ ‌రోడ్‌పై గుర్తుతెలియని వాహనం ఢీ కొని మృతి చెందినట్లుగా తన అన్న మంజుల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటికి వచ్చింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదులు అన్న కొడుకైన మంజుల రమేష్‌ ‌లారీలను ఫైనాన్స్ ‌ద్వారా కొనుగోలు చేసి అప్పులపాలు అయ్యి ఏమీచేయ్యాలో తెలియక మళ్లీ ఫైనాన్స్‌లో లారీలను కొనుగోలు చేయడానికి వెళ్లగా ఫైనాన్స్ ‌దారులు ఇవ్వమని చెప్పడంతో రమేష్‌ ఇం‌ట్లో ఉంటున్న తన బాబాయి మంజుల సైదులు పేరు మీద రెండు లారీలను కొనుగోలు చేసి వాటిని రెండు మూడు, నెలలు నడుపగా నెలసరి వాయిదాలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ ‌వారు లారీలను తీసుకెళ్లారు.

అప్పులు ఇచ్చిన వారు రమేష్‌ను ఇబ్బందులు పెట్టడంతో సైదులుకు వెనుక ముందు ఎవరు లేకపోవడంతో రమేష్‌ ‌తన బాబాయి పేరు మీద 50లక్షల ఇన్సూరెన్స్ ‌చేసి అతన్ని యాక్సిడెంట్‌లో చంపి ఇన్సూరెన్స్ ‌ద్వారా వచ్చిన డబ్బులతో అప్పులు చెల్లించవచ్చని భావించి తన స్నేహితులైన గంధం మహేష్‌, ‌మాతంగి శోభన్‌బాబుతో 5లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని సైదులుని చంపడానికి మొదటిసారి ప్రయత్నం విఫలం కావడంతో జనవరి 24న రాత్రి ముగ్గురు కలిసి మంజుల రమేష్‌ ఇం‌టి వద్దనుండి తీసుకొని పోయి మార్గం మధ్యలో అతడికి బాగా మద్యం తాగించి ఇందిరానగర్‌ ‌గ్రామం ముందుగల 65వ జాతీయ రహదారి సర్వీస్‌ ‌రోడ్డులో టిఎస్‌29 ఈ7071‌తో ఢీ కొట్టి చంపినట్లుగా నింధితులు తెలిపి నట్లు సిఐ శివశంకర్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. నింధితులని రిమాండ్‌కి పంపు తున్నట్లు పేర్కొన్నారు. వారితోపాటు ఎస్సై సత్యనారాయణ గౌడ్‌లు ఉన్నారు.

Leave a Reply