Take a fresh look at your lifestyle.

తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

భారీగా ధ్వంసమైన ఘాట్‌ ‌రోడ్డు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్‌ ‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌ ‌రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. టీటీడీ చైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి ఈ ప్రాంతాలను పరిశీలించారు. నాలుగు చోట్ల భారీ ప్రమాదం జరిగిందని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు. అనంతరం చైర్మన్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి వి•డియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్‌ ‌రోడ్లలో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు.

ఉదయం 5:45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్‌ ‌బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్‌ ‌చెప్పారు. అప్‌ ‌ఘాట్‌ ‌రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్‌ ‌చెప్పారు.

Leave a Reply