Take a fresh look at your lifestyle.

ఎపిలో బ్రిటన్‌ ‌తరహా వైద్య సేవలు

  • డాక్టర్స్ ‌డే సందర్భంగా జిజిహెచ్‌లో కేన్సర్‌ ‌బ్లాక్‌ ‌ప్రారంభం
  • గ్రామస్థాయిలో వైద్య సేవల విస్తరణకు శ్రీకారం
  • 108,104 వాహనాలకు పచ్చ జెండా ఊపిన సిఎం జగన్‌

అమరావతి,జులై 1 : బ్రిటన్‌ ‌తరహాలో గ్రామాల్లోనూ వైద్యాన్నిఅందుబాటులోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.డాక్టర్‌ ‌డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. గుంటూరు జిజిహెచ్‌లో నాట్కో కేన్సర్‌ ‌బ్లాక్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.1088 కొత్త అంబులెన్స్‌లను కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రారంభించారు. విజయవాడ బెంజి సర్కిల్‌ ‌వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యాధునిక సౌకర్యాలతో సేవలందించేందుకు రూపొందించిన 108, 104 అంబులెన్స్‌లను బుధవారం సిఎం జగన్‌ ‌జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు నుంచే రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రానికి ఒక వాహనం నడపనున్నారు. ఆరోగ్య రంగంలో ఇప్పటికే అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన మరో సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేశారు. గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ ‌బ్లాక్‌ను ప్రారంభించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా కేన్సర్‌ ‌బ్లాక్‌ ‌ప్రారంభానికి జగన్‌ శ్రీ‌కారం చుట్టారు. అనంతరం సీఎం జగన్‌ ‌మాట్లాడుతూ…ఏపీ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి విద్యా, ఆరోగ్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. మరో ఏడాదిలోనే కర్నూలు కూడా కేన్సర్‌ ‌విభాగానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం కొత్త 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల రక్షణ కోసం జిల్లాకు రెండు చొప్పున నియోనాటల్‌ అం‌బులెన్స్ ‌లను అందుబాటులో ఉంచామని తెలిపారు.

British medical services in the AP

తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌ ‌విధానం తీసుకొస్తున్నామని, రోగుల కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ ఎలక్టాన్రిక్‌ ‌హెల్త్ ‌రికార్డ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.’104 అంబులెన్స్‌ల ద్వారా గ్రామాల్లో వైద్యసేవలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ప్రతి 5 నుంచి 7 గ్రామాలకు ప్రత్యేకంగా ఓ డాక్టర్‌ను నియమిస్తాం.యూకే తరహాలో గ్రామాల్లో వైద్య విప్లవం తీసుకువస్తామ న్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ హెల్త్ ‌కార్డులు అందించాం. 104, విలేజ్‌ ‌క్లినిక్‌, ‌పీహెచ్‌సీలను అనుసంధానిస్తాం. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లల ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది. అంతేకాకుండా విద్యుత్‌ ‌సౌకర్యంలేక సెల్‌ఫోన్‌ ‌లైట్లతో వైద్యం అందించిన పరిస్థితిని చూశాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ప్రజల ఆరోగ్య రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. మరోవైపు ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్ ‌డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. డ్రైవర్లకు జీతాలను భారీగా పెంచారు. సర్వీసుకు అనుగుణంగా డ్రైవర్ల జీతాన్ని రూ.18 నుంచి 20 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా, ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 20వేల రూపాయల వరకు అందనుంది.అలాగే ఎమె•-జ్గ•న్సీ మెడికల్‌ ‌టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ‌ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్‌ ‌టెక్నీయన్‌ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్‌ ‌చెప్పారు. పెంచిన జీతాలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు సీఎం జగన్‌ ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను 108,104 కలిపి బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్‌ ‌సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోయాయి.ప్రతి మండలానికి కొత్తగా 104, 108 వాహనాలు కేటాయించారు.

Leave a Reply