Take a fresh look at your lifestyle.

చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంక్‌ను దర్శించిన బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌

‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌తో కలసి రక్తదానం చేసిన చిరు

హైదరాబాద్‌: ‌బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌..‌జూబ్లీహిల్స్ ‌లోని చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేత్‌ ‌రక్తదానం చేశారు. ఆయనతో పాటు మెగాస్టార్‌ ‌చిరంజీవి కూడా రక్తదానం చేశారు. గ్యారేత్‌ ‌తమ బ్లడ్‌ ‌బ్యాంకును విజిట్‌ ‌చేసి.. రక్తదానం చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. తనకు ఇండియన్‌ ‌ఫిల్మ్ ‌పర్సనాలిటీ ఆఫ్‌ ‌ది ఇయర్‌ 2022 అవార్డు వచ్చినప్పుడు కూడా గ్యారేత్‌ ‌విష్‌ ‌చేశారని చిరంజీవి గుర్తు చేశారు. 25 సార్లకంటే ఎక్కువ బ్లడ్‌ ‌డొనేట్‌ ‌చేసిన వారికి గతంలో ఏడు లక్షల విలువగల జీవిత బీమా కార్డులు అందించామని.. ఇప్పుడు మరో1500ల మందికి జీవిత బీమా కార్డులు అందిస్తున్నామని చెప్పారు.

అత్యవసర సమయంలో బ్లడ్‌ ‌దొరక్క చాలా మంది చనిపోతున్నారని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ దూరపు బంధువు కూడా బ్లడ్‌ ‌దొరక్క చనిపోయారని, అందుకే బ్లడ్‌ ‌బ్యాంక్‌ ఏర్పాటు చేశానని..తన వంతు సహాయం అందిస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌ ‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోనూ బ్లడ్‌ ‌బ్యాంకు విస్తరించాలని ఉన్నా.. చేయలేకపోతున్నానని అన్నారు. బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌సేవలు అందించడం అంత ఈజీ కాదన్నారు. తన అభిమానులు చాలా ప్రాంతాల్లోనూ బ్లడ్‌ ‌బ్యాంక్స్ ఏర్పాటు చేస్తున్నారంటూ చిరు ఆనందం వ్యక్తం చేశారు.గ్యారేత్‌ ‌మాట్లాడుతూ..’ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో చిరంజీవి ఒకరు. ఆయన చేస్తున్న సేవలకు నా అభినందనలు’ అన్నారు.

Leave a Reply