అమరావతి,ఆగస్ట్10 : బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ మంగళవారం సిఎం జగన్ను కలిశారు. పలు అంవాలపై వీరు చర్చించారు. ఆండ్రూతో పాటు బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్ టీంను కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిటన్ టీం సీఎం జగన్కు వివరించింది. అనంతరం సీఎం జగన్.. డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ను సన్మానించి, జ్ఞాపిక అందజేశారు.