Take a fresh look at your lifestyle.

ఆగ్రో కార్పోరేషన్‌ ‌చైర్మన్‌ ‌నవీన్‌ ‌నిశ్చల్‌

ఆగ్రో కార్పోరేషన్‌ ‌చైర్మన్‌ ‌నవీన్‌ ‌నిశ్చల్‌
అనంతపురం,జూలై20 : వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకోచ్చే విధంగా పని చేస్తానని రాష్ట్ర ఆగ్రో కార్పోరేషన్‌ ‌చైర్మన్‌ ‌నవీన్‌ ‌నిశ్చల్‌ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని పార్లమెంట్‌ ‌కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైర్మన్‌గా ఎంపికకు పూర్తిగా సహకరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి , ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌డ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు దివంగత నేత వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి అనంతరం తన తనయుడు జగన్మోహన్‌ ‌రెడ్డిలు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధన్యత ఇచ్చారన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఆగ్రో కార్పోరేషన్‌ ‌చైర్మన్‌ ‌గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పర్యటించి ఆగ్రో కార్పోరేషన్‌ ‌ద్వారా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పనులు చేపట్టడానికి ఆగ్రోస్‌ ‌ని నోడల్‌ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. రైతులకు సబ్సిడీలో పురుగు మందులు, జిప్సం, బయెనా ప్రొడక్టులు సకాలంలో అందే విధంగా చూస్తాను. అవసరమైతే రాష్ట ముఖ్యంత్రి, వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి బ్జడెట్‌ను పెంచడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించి , అధికారులతో సక్షలు నిర్వహించి ఆగ్రో కార్పొరేషన్‌ ‌ద్వారా రైతు లకు మంచి సేవలను అందించి …. కార్పొరేషన్‌ ‌మంచి పేరును తీసుకోచ్చే విధంగా పని చేస్తామన్నారు.

Leave a Reply