Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌బీమా పాలసీలు తేండి… !

బీమా వ్యాపారం భారతదేశంలో లోతుగా పాతుకుపోయింది. మార్కెట్లోకి కొత్త పాలసీలను విడుదల చేసేందుకు జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు పోటీపడుచుంటాయి. కొత్త కొత్త పాలసీలను రూపకల్పన చేయడానికి వాటికవే అవకాశాలను సృష్టించు కుంటాయి. భారతదేశంలో బీమా పరిశ్రమ ఐ.ఆర్‌.‌డి.ఎ. ఇన్సురెన్స్ ‌రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అం‌డ్‌ అథారిటీ అనేది బీమా పరిశ్రమలను పరిపాలించే మరియు పర్యవేక్షించే చట్టబద్ధమైన, స్వతంత్ర, అత్యున్నత సంస్థ. దీని నిబంధన ప్రకారం కను సన్నల్లో బీమా సంస్థల వ్యాపారం సాగుతుంది. ఇది పాలసీదారుల ఆస్థికి మరియు హక్కులను రక్షించడం, బీమా పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడం, నిర్ధారించడం, దావాలను వేగవంతంగా పరిష్కరించడం, మోసాలు, దుర్వినియోగాలను నివారించడం, బీమాతో వ్యవహరించే ఆర్థిక మార్కెట్లలో పారదర్శకత మరియు క్రమబద్ధమైన ప్రవర్తననను తీసుకరావడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో పది మంది సభ్యులుంటారు. ఒక ఛైర్మన్‌ (5 ‌సం।।ల పదవి), 5 గురుల పూర్తికాల సభ్యులు, 4 గురు పార్ట్‌టైం సభ్యులు, ప్రస్తుత ఛైర్మన్‌ ‌సుభాష్‌ ‌చంద్ర ఖున్తియో. వీరందరిని భారత ప్రభుత్వం నియమిస్తుంది. ఐ.ఆర్‌.‌డి.ఎ. ఆఫ్‌ ఇం‌డియాను పార్లమెంట్‌ ‌చట్టం చేసి డిసెంబర్‌ 26, 2004‌న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ చేత ఏర్పాటు చేయబడింది.

మీకు ఆనారోగ్యం వస్తే మేమున్నాం.. అంటూ ప్రకటనల జోరుతో హోరెత్తించే బీమా సంస్థలు నేడు దేశంలో కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుచూ మారణహోమం సృష్టిస్తుంటే, దీనికి ప్రభుత్వం కట్టడి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుంటే.. ప్రైవేటు చికిత్స కోసం రూ।। లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఒకవేళ ఆరోగ్యం కుదుట పడ్డా ఆ వైరస్‌ ‌మిగిల్చే ఆర్థిక భారం కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఈ వ్యాది తీవ్రత అంతగా లేని తొలినాళ్లలో తక్కువ ప్రీమియానికే కరోనా పాలసీలు అంటూ వరుస కట్టినాయి. అయితే ఇవ్వన్నీ రూ।। 25 వేల నుండి లక్ష రూపాయల మధ్యలోనే ఉండేవి. కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌వస్తే ఈ పరిహారాన్ని అందిస్తామని చెప్పాయి. కానీ పరిస్థితులు మారినాయి. ఇప్పటికీ తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీల్లో కొరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఐ.ఆర్‌.‌డి.ఏ. చెప్పడంతో బీమా సంస్థలు ఈ ప్రత్యేక పాలసీల జోరును తగ్గించాయి. మరికొన్ని బీమా సంస్థలు వాటిని ఇవ్వడమే మానేశాయి. ‘‘డిసీజ్‌ ‌స్పెసిఫిక్‌’’‌గా కొరోనా కోసం ప్రత్యేకంగా రెండు రకాల పాలసీలను తీసుకరావాలని నియంత్రణ సంస్థ కొన్ని మార్గ దర్శకాలను రూపొందించింది. అన్ని బీమా సంస్థలు ఒకే ప్రామాణిక నిబంధనలతో ఈ పాలసీ జూన్‌ 15 ‌వరకు తీసుకరావాలని తెలిపింది. ఉలుకు పలుకు లేని బీమా సంస్థల తీరుతో తర్వాత జూన్‌ 20‌కి గడువు పెంచింది. కానీ బీమా సంస్థలు మరింత సమయం కావాలనడంతో జులై 10 లోగా కొత్త పాలసీలను తెవాలన్నది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు మరియు పాలసీల పేర్ల (కొరోనా కవచ్‌, ‌కొరోనా రక్షక్‌)‌ని విడుదల చేసింది. ఈ సారికైనా ఈ కొత్త పాలసీలు వస్తాయా ! అనే సందేహం వెంటాడుతుంది. బీమా సంస్థలు ఐ.ఆర్‌.‌డి.ఓ. మార్గదర్శకాలను చూసిచూడనట్లుగా వ్యవహరిస్తూ కాలం నెట్టుకొస్తున్నాయి.

దేశంలోని ప్రస్తుత కష్టకాలంలో బీమా సంస్థలు ఇష్టానుసారంగా పాలసీలను తీసుకరాకుండా కట్టడి చేసేలా ఐ.ఆర్‌.‌డి.ఏ. కరోనా కోసం తెచ్చే పాలసీలకు మార్గదర్శకాలు రూపొందించి, ప్రీమియం నిర్ణయాధికారం బీమా సంస్థలకే ఇచ్చింది. దేశం మొత్తం అది ఒకే ప్రిమియం ఉండాలని నిబంధనలు విధించింది. బీమా సంస్థల లెక్కలు ఎలా ఉన్నా ఐ.ఆర్‌.‌డి.ఎ. చెప్పింది కాబట్టి ఖచ్చితంగా పాలసీలు తీసుకురావల్సిందే, కాని వీటికి ఆదరణ లభించకుండా బీమా సంస్థలు మీన మేషాలు లెక్కిస్తున్నాయి. బీమా సంస్థలు పై రెండు పాలసీలను తెస్తే ప్రజలకు ప్రయోజనం కల్పించిన వారవుతారు. దీనితో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల ధనదోపిడీని కట్టడి చేయాల్సి ఉందని గమనించండి. దేశం మొత్తం ఒకే ప్రీమియం వర్తింపుతోపాటు ఏడాది పాలసీలు అవసరమంటున్న నిపుణుల సూచన కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రత్యేక పాలసీలు వస్తే మా వ్యాపారం తగ్గుతుందనే భావన వీడి, బీమా సంస్థలు ప్రజా ప్రయోజనా (విపత్కర పరిస్థితు)ల దృష్ట్యా మానవీయ కోణంలో ఆలోచించాలి. ఇప్పటికే ఐ.ఆర్‌.‌డి.ఎ. మార్గ దర్శకాలతో వచ్చిన ‘‘ఆరోగ్య సంజీవని’’ పాలసీని బీమా సంస్థ పెద్దగా ప్రచారం చేయడం లేదు ఇది భావ్యమా ! బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐ.ఆర్‌.‌డి.ఎ.) చెప్పిందని పేరుకే ఈ పాలసీలను తీసుకరావడం వలన ఉపయోగం లేదు.

వీటికి ప్రజల ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా వాటి ప్రీమియం నిర్ణయించడం, ప్రచారం చేయడంతో పాటు వీలైతే పేద ప్రజల ప్రీమియాన్ని పాలకులే భరించాలి. ఈ కష్టకాలంలో సామాన్యుడికి భరోసా ఇచ్చేలా చూడాలి. కొరోనా విపరీతంగా విజృంభిస్తున్న వేళ… ఈ పాలసీలు ఎంత తొందరగా వస్తే (తెస్తే) అంత మంచిదనే నిపుణుల సూచనలు పాటిస్తే దేశ ప్రజల ఆరోగ్య రక్షణను కల్పించిన వారు అవుతారాని గమనించండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొర వసతులతో చేరలేని వారు ఒకవైపు, మరోవైపు ప్రైవేటులో చికిత్స చేయించుకోవడానికి లక్షల్లోనే ఖర్చు అవతుందన్నది నిజమే కదా ! ఇది ఒక్కరికి వస్తే కుటుంబ సభ్యులను చుట్టేస్తుందన్న భయానక స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు ప్రజలు. ఇప్పట్లో కరోనాకు మందులేదు… టీకా రావడానికి సమయం పడుతుందని అంటున్నవేళ ‘‘మీకు అనారోగ్యం వస్తే మేమున్నాం’’ అంటూ ఇన్నాళ్ళు చెప్పిన బీమా సంస్థలు, మరణించినాక ఇచ్చేది సభ్యుల ధనమే కదా.. అవసరాల కోసం ప్రజలు బయట వెల్లక తప్పడం లేదు. వెళ్లితే చావును ఇంటికి మోసుకొస్తున్నమనే… భీకర స్థితినుండి కొంతలో కొంతైనా ఆ కుటుంబాలకు తోడ్పాటు ఇచ్చే విధంగా బీమా సంస్థలు ముందుకు రావాలి. కోవిడ్‌ ‌బీమా పాలసీలు అమలులోకి వచ్చేలా చూడాలి. కొరోనా వైరస్‌ ‌చిన్న పెద్ధ, ధనిక, పేద అని తేడా లేకుండ ప్రాణాలతో చెలగాట మాడుతున్న వేళ ప్రభుత్వాలు టీకా, మందులతో పాటు బీమా పాలసీలను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తెప్పించాలి.

ఆరోగ్య బీమా పాలసీలను రూపొందించి ప్రీమియం నిర్ణయించడం కంటే ముందే ! ఆయా వ్యాదుల చికిత్సకు అయ్యే ఖర్చు, జబ్బు ప్రభావం లాంటి అంశాలను భీమా సంస్థలు లెక్కలు వేసుకుంటాయి. నేటికి కొరోనాతో దేశవ్యాప్తంగా ఏడు లక్షల కేసులు, 20వేల మంది మరణాలతో మృత్యు ఘంటికలు మోగిస్తుంది. దీని మూలంగా మధ్య పేద తరగతుల ప్రజలు హడలెత్తిపోవుచున్నారు. పాలకులు కరోనా వైద్యానికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పరచామంటూనే… వారికి వైరస్‌ ‌సోకితే మాత్రం కార్పోరేటు హాస్పిటల్‌కు వెళ్ళుచున్నారు. కొరోనాకేమో సమభావం… పాలకులకేమో స్వార్థ భావమా అని పాలితుల ఆవేధన తీరటానికి కరోనా నివారణకి వ్యాక్సి(మందు)నో – జీవితానికి ధీమా కోసం బీమా పాలసీలు రావాలి, పాలకులూ వెంటనే పాలితుల జీవితాల్లో ధీమా నింపండి…!జీవిత బీమా అంటే… ‘‘జీవితంతో పాటు, జీవితం తర్వాత కూడా’’ అనే బీమా సంస్థల మాటలకు స్వార్థకత చేకూర్చండి…

మేకిరి దామోదర్‌, ‌వరంగల్‌ ‌సెల్‌: 9573666650

Leave a Reply