ప్రస్తుత వర్షాకాల సమయంలో వరుద ఉదృతికి దస్రు మాటు ప్రవహించి కొన్ని గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, దీనికై నూతనంగా ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జీ నిర్మాణ పనులను వేగవంతం చేసి రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు మండలం అన్నంపల్లి గ్రామ సమీపంలోని దస్రు మాటు ఉదృతిని గురువారం సీతక్క పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ వరుద ఉదృతికి రోడ్డు మార్గం పూర్తిగా పనికి రాకుండా పోతుందని అన్నారు. వెంటనే బ్రిడ్జీ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సంబందిత అధికారులకు ఫోన్ ద్వారా తెలుపడం జరిగిందన్నారు.
అనంతరం గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన జక్కు రణదీప్ సోదరి నికిల వివాహనికి హజరై వదూవరులను ఆశీర్వదించారు. ఆదే గ్రామంలోని కందాల సమ్మిరెడ్డి కూతురూ వివాహనికి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు చాంద్ పాషా, బానోత్ విజయ రూప్ సింగ్, వర్కింగ్ కమిటి అద్యక్షుడు సుంకరబోయిన మొగిలి,ఎంపిటిసి మాపురపు తిరుపతిరెడ్డి, రుద్రారపు శంకర్, గోవిందరావుపేట మండల అద్యక్షులు సహకార సంఘం చైర్మెన్ ఎల్లారెడ్డి, సర్పంచ్ ముద్దబోయిన రాము, ఉప సర్పంచ్ బద్దం లింగారెడ్డి, నాయకులు అంజిరెడ్డి, సురేష్ తదితరులు పాల్గోన్నారు.