Take a fresh look at your lifestyle.

ఊపిరాడక…

నీ బాధ నేను చూడలేను
ప్రాణవాయువు దొరకక
ప్రాణాలు తీసేస్తుందని
నిన్ను చూశాక తెలిసింది
బెడ్‌ ఉం‌టే ఆక్సిజన్‌
‌సిలెండర్‌ ‌దొరకదు
అత్యవసర ఇంజెక్షన్‌
‌బ్లాక్‌ ‌మార్కెట్‌లో…
చేతులెత్తేసిన ప్రజా నేతలు
ముఖం చాటేస్తున్న
ఇరుగు పొరుగు వారు
అర్ధాంతరంగా బక్కెట్‌
‌తన్నేసిన క్షణాలు
ఊపిరాడక నీవు
కల్లేదుటే పిట్టాలా నీవు
రాలిపోతుంటే
నిండునూరేళ్ళు బతకాల్సిన
నీవు
కొరోనాతో పోరాడి పోరాడి
ఊపిరాడక
పైలోకాలకు పయణ మైయ్యావు
క్షమించు నన్ను కడవరకు
నీతోడుంటానని చేసిన బాసలు
నిలబెట్టుకోలేక పోయాను
నీ జ్ఞాపకాలచితిలో
నామనసు బూడిద అవ్వని…
గాదిరాజు రంగరాజు
           కవి, ఫ్రిలాన్స్ ‌జర్నలిస్ట్
            8790122275

Leave a Reply