Take a fresh look at your lifestyle.

పేదలకు అల్పాహారం ఏర్పాటు అభినందనీయం: కలెక్టర్‌ ‌వెంకటరావు

మహబూబ్‌గర్‌, 14 ‌మే( ప్రజాతంత్ర ప్రతినిధి): లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో పేద ప్రజలకు ఆంధ్ర బ్యాంకు అధికారులు ప్రతిరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ‌వెంకట రావు అన్నారు. గురువారం మహబూబ్నగర్‌ ‌జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీసు ఎదురుగా ఉన్న ఆంధ్ర బ్యాంకు మోనప్ప గుట్ట వద్ద ఆంధ్ర బ్యాంకు అధికారులు, సేవా భారతి ఆధ్వర్యంలో పేద ప్రజలకుద్దేశించి ఏర్పాటుచేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంకు అధికారులు అందరూ చారిటబుల్‌ ‌ఛాలెం జ్‌ ‌పేరుతో గడచిన ఏడు రోజుల నుండి ప్రతిరోజు సుమారు ఏడు వందల మందికి నాణ్యమైన అల్పాహారం అందించడం సంతోషమని అన్నారు .అధికారులు ఇంకా మరికొంతమందికి అల్పాహారం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆంధ్ర బ్యాంక్‌ ‌డిప్యూటీ జనరల్‌ ‌మేనేజర్‌ ఆర్‌. ‌వెంకటేశ్వర్లు ,చీఫ్‌ ‌మేనేజర్‌ ‌హరనాథ్‌, ‌ధన్రాజ్‌ ,‌సీనియర్‌ ‌మేనేజర్లు శ్రీనివాస్‌, ‌విశ్వనాథ్‌ ,‌బ్రాంచ్‌ ‌మేనేజర్‌ ‌సుధాకర్‌, ఇన్స్పెక్టర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply