Take a fresh look at your lifestyle.

‌బ్రాండ్‌ ఇం‌డియా ఇమేజ్‌ ‌దెబ్బతింటోంది

“మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.  45 ఏళ్ళ గరిష్టానికి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది.  పాశ్చాత్య దేశాలే కాక, మనకు బాగా స్నేహంగా ఉన్న రాష్ట్రాలు భారత్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ ‌పడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటివి తెచ్చి పెట్టుకున్న సమస్యలవల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయి.”

Brand India image is getting worse

బ్రాండ్‌ ఇం‌డియా ఇమేజ్‌ ‌దెబ్బతింటోదని ప్రపంచదేశాలు ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నాయి, మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో హిందూ రాష్ట్ర భావనలు పెరిగాయి. దీంతో భారత్‌ ‌కి వ్యతిరేకంగా క్రైస్టో- ఇస్లామిక్‌ ‌కుట్ర ప్రారంభమైంది. హిందూ రాజ్యమే తమ లక్ష్యమని సంఘ్‌ ‌పరివార్‌ ‌నాయకులు పదే పదే చేస్తున్న ప్రకటనలు భారత దేశంపై ఇతర మతాలకు చెందిన దేశాలు ద్వేషాన్నిపెంచుకుంటున్నాయి. చైనాకు మాత్రం విలక్షణమైన ప్రమాణాలు ఉన్నాయి. మిగిలినవన్నీ నిజం కాకపోవచ్చు కానీ, చివరి దాని విషయంలో అలా అనుకోవడానికి కారణం ఉంది. ఏడు దశాబ్దాల క్రితం నాటి వ్యవహారం. అన్ని దేశాలూ భారత్‌ ‌విజయవంతమైన రీతిలో ప్రభుత్వాన్ని నడపాలని ఆకాంక్షించాయి. అయితే, సంప్రదాయ శత్రువులుగా వ్యవహరిస్తున్న చైనా, పాకిస్తాన్‌ ‌తప్ప. ఈ రెండు దేశాలతో కూడా భారత్‌ ‌కు శత్రుత్వం లేదు. భారత్‌ ‌పురోగమనాన్ని చూసి అవి అసూయ పడుతున్నాయి.ఆ కారణంగానే ద్వేషాన్ని పెంచుకున్నాయి. ఆకాంక్షలను పెద్దవిగా చేసుకోవడం మనకు అలవాటు ప్రతి దశాబ్దంలోనూ భారత్‌ ‌మరింత ఎక్కువ అభివృద్ధిని సాధిస్తుందని ఇతర దేశాలు అంచనా వేస్తుంటాయి. అవి సహజమైనవే. కానీ మన దేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. భారత్‌ ఆర్థిక స్తబ్దత ఒక అవరోధం. ఇందుకు కారణం మనం ఎంచుకున్న ప్రాధాన్యతలు. దేశంలో ప్రమాణాలు పడిపోతున్నాయి. అవినీతి పెరుగుతోంది. వీటికి తోడు దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ ఆర్‌ ‌సీలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు దేశం ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నియి . ఈ రెండింటి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

- Advertisement -

ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత మూడు దశాబ్దాల్లో దావోస్‌ ‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో భారత్‌ ‌కు ఒక్క సారి కూడా అనుకూల పరిణామం సంభవించలేదు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న భారత్‌ ‌లో ప్రభుత్వాలు మారడం సహజం.అయినప్పటికీ ఆర్థిక విధానాల్ల పెద్దగా మార్పులు లేవు. భారత్‌ ‌తన వైవిధ్యాన్ని కాపాడుకుంటూనే ఉంది. ఆర్థికంగా,వ్యూహాత్మకంగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. ఈ మూడు దశాబ్దాల్లో ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. బాల్కాన్స్ ‌నుంచి మధ్య ప్రాచ్యం వరకూ. 1991 తర్వాత భారత్‌ ఆర్థికంగా బాగా అభివృద్ధిని సాధించింది. బ్రాండ్‌ ఇం‌డియాను సాధించుకుంది. చైనా మాత్రం భారత్‌ ‌కన్నా ముందుగా ఆర్థిక సంస్కరణలను అమలు జరిపి ముందంజ వేసింది. అభివృద్ది చెందుతున్న దేశాలు మూడింటిలో ఒకటిగా ఉంది. నియంతృత్వ రాజకీయ ఆర్థిక వ్యవస్థకు చిరునామాగా ఉంది. పుతిన్‌ ‌నేతృత్వంలోని రష్యా, ఆయతుల్లా నేతృత్వం లోని ఇరాన్‌ ‌కన్న ముందుంది. భారత్‌ ‌పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారత్‌ ‌లో ప్రజాస్వామ్యం ఉన్నా, ఉదార వాదం విషయంలోనూ, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో సమ్మిళితమైన అభివృద్ది సాధించలేదు. సోవియట్‌ ‌యూనియన్‌, ‌యుగొస్లావియా ల మాదిరిగా కకావికలైనా ఆశ్చర్యం లేదు. లేదా రష్యా, టర్కీ, చైనాల మాదిరిగా నియంతృత్వ పోకడలకు పోయినా ఆశ్చర్యం లేదు.దేశంలో దారిద్య్రం, అభద్రతా భావం,వైవిధ్యం పెరిగి పోతోంది., లక్షలాది సమస్యలు ఉన్నాయి. దశాబ్దాలుగా భారత్‌ ‌కు మిత్రులుగా ఉన్నవారు మనల్ని అనుమానపు దృక్కులతో చూస్తున్నారు. దీనికి కారణం మోడీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలు. విదేశాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్‌ ‌లలో భారత్‌ ‌స్టాల్‌ ‌ను ఏర్పాటు చేయడం లేదు. దేశంలో ఇటీవల పరిణామాలు భారత్‌ ‌సహజ మిత్రులను కూడా గందరగోళంలో పడవేస్తున్నాయి. దేశంలో ఇటీవల పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలు, ప్రదర్సనలు భారత్‌ ఇమేజ్‌ ‌ని దెబ్బతీశాయి.

గతంలో ఎప్పుడూ ఈ మాదిరిగా మహిళలు, అట్టడుగు వర్గాలు ఈ మాదిరిగా వీధుల్లోకి రాలేదు. 1991 తర్వాత భారత్‌ ‌పాక్‌ ‌నుంచి వస్తున్న ఉగ్రవాదులతో పోరు సాగించాల్సి వస్తోంది. పాకిస్తాన్‌ ‌జిహాదీల మిత్ర దేశంగా ముద్ర పడింది. పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌భారత్‌ ‌ను 1930 లో నాజీల పాలనలో ఉన్న జర్మనీతో పోల్చారు. మేధావుల్లో కూడా విభజన రేఖ ఏర్పడింది. గందరగోళం ఏర్పడింది. భారత్‌ ‌పై విమర్శలను ఎలా తిప్పికొట్టాలో వారికి తెలియడం లేదు విద్యావేత్తలు, జర్నలిస్టులపై ఒత్తిడి పెరిగింది.. భారత్‌ ‌చైనా మాదిరిగా ఎందుకు వ్యవహరిస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. మరో వంక ఆర్థికరంగంలో వృద్ది రేటు తగ్గిపోయింది. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. 45 ఏళ్ళ గరిష్టానికి నిరుద్యోగ సమస్య పెరిగి పోయింది. పాశ్చాత్య దేశాలే కాక, మనకు బాగా స్నేహంగా ఉన్న రాష్ట్రాలు భారత్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ ‌పడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. సీఏఏ, ఎన్‌ ఆర్‌ ‌సీ వంటివి తెచ్చి పెట్టుకున్న సమస్యలవల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయి.
– శేఖర్‌ ‌గుప్తా
‘ది ప్రింట్‌ ‌సౌజన్యంతో’

Tags: Brand India image,getting worse, modi govt

Leave a Reply