Take a fresh look at your lifestyle.

యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

మోహినీ అలంకారంలో స్వామివారు ఊరేగింపు

యాదాద్రి భువనగిరి,మార్చి10(ఆర్‌ఎన్‌ఎ): ‌యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఏడో రోజు ఉదయం స్వామివారు జగన్మోహిని అలంకార సేవలో బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. లోక కల్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు.ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైఢూర్యాల ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు.

వేద మంత్రాలు, వేదపారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి వారి ఊరేగింపు సేవ సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్‌ ‌థిగళ్‌ ‌లక్ష్మీ నరసింహచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకు అశ్వ వాహనం పై స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం అంగరంగ వైభవంగా సాగనుంది.

Leave a Reply