Take a fresh look at your lifestyle.

ఎల్‌ఆర్‌ఎస్‌ అం‌టున్న టిఆర్‌ఎస్‌ను బహిష్కరించండి

  • హరీష్‌రావు తప్పుకుని రామలింగారెడ్డికి మంత్రి పదవీ ఎందుకివ్వలేదు
  • దుబ్బాక నుంచి జూమ్‌, ‌ఫేస్‌బుక్‌  ‌లైవ్‌లో పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఎల్‌ఆర్‌ఎస్‌ అం‌టున్న అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీని దుబ్బాకలో జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రజలందరూ బహిష్కరించాలని తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 3న జరగనున్న దుబ్బాక పోలింగ్‌ ‌నేపథ్యంలో ఉత్తమ్‌ ‌శనివారం దుబ్బాక నుంచి జూమ్‌, ‌ఫేస్‌బుక్‌ ‌లైవ్‌లో మాట్లాడుతూ…రాష్ట్ర ఖజానాను నింపుకోవడానికి పేదలు ఎన్నడో కొన్న ప్లాట్లు, ఇండ్ల మీద 40-50వేలరూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ ‌చేయించుకోవాలని అధికార పార్టీ అంటుందనీ…ఎల్‌ఆర్‌ఎస్‌ అం‌టున్న టిఆర్‌ఎస్‌కు ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తగు గుణ పాఠం చెప్పాలన్నారు. ఉప ఎన్నికల్లో ‘నో ఎల్‌ఆర్‌ఎస్‌ ‌నో టిఆర్‌ఎస్‌’ ‌నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనీ పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సుమారుగా 13లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగితే ఒక ఎకరానికి కూడా రైతుకు సిఎం కేసీఆర్‌ ‌నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. పంట బీమా పథకాన్ని ఎత్తివేశారనీ, ఇది సిఎం కేసీఆర్‌ ‌వైఫల్యమేననీ అన్నారు. ముందుచూపులేని సర్కార్‌ అని మండిపడ్డారు. రామలింగారెడ్డి దుబ్బాకలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారనీ, దుబ్బాకను అభివృద్ధి చేయలేకపోతున్నానని స్వయంగా రామలింగారెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారనీ, అధికారంలో ఉన్నా అధికారులు తనకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారనీ గుర్తు చేశారు. రామలింగారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారనీ మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదన్నారు. హరీష్‌ ‌రావు తప్పుకొని మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదనీ, ఇప్పుడు హరీష్‌ ‌రావు ఏ మొఖం పెట్టుకుని దుబ్బాకలో వోట్లు అడుగుతున్నారనీ ప్రశ్నించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply