Take a fresh look at your lifestyle.

చిన్నారిని మింగేసిన .. బోరు బావి

  • మెదక్‌ ‌జిల్లా పొడ్చన్‌పల్లిలో సంఘటన
  • సహయక చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే
  • ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రెస్య్యూ ఆపరేషన్‌
మెదక్‌ ‌జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో ప్రమాదవశాత్తు బోరుబావి గుంతలో మూడేళ్ళ బాలుడు మృతి చెందిన సంఘటన  విషాదాన్ని నింపింది . బుధవారం సాయంత్రం గ్రామానికి చెందిన భిక్షపతి  పొలంలో బోరు వేయించాడు. ఈ క్రమంలో  ఆయన అల్లుడు గోవర్ధన్‌ ‌బోరు వద్దకు వెళ్ళగా తండ్రి వెనుక   సంజయ్‌ ‌సాయి వర్ధన్‌ (3)  ‌ప్రమాదవశాత్తు తవ్విన బోరు బావిలో పడిపోయాడు బోరు బావి నుండి సాయి అరుపులు  రావడంతో ఆందోళనకు గురయ్యారు ఎంత ప్రయత్నించినా  ఫలితం దక్కకపోవడంతో  గ్రామస్తుల దృష్టికి వెళ్ళింది  విషయం తెలుసుకున్న  జిల్లా యంత్రాంగం హుటాహుటిన  బోరు బావి వద్దకు  చేరుకొని చిన్నారిని  కాపాడే  ప్రయత్నంలో పడ్డారు విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పద్మ దేవేందర్‌ ‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్నారు. దీంతో సహాయక చర్యలు చేపట్టగా సుమారు 25 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి తెలిపారు. బాలుడిని బయటకు తీసేందుకు పొక్లెయిన్‌లతో సమాంతరంగా తవ్వడం మొదలుపెట్టారు.
పోలీసులు బోరుబావి గుంతలోకి ఆక్సిజన్‌ను పంపగా రాత్రి  ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ‌రెస్య్కూ టీమ్‌ ‌చేరుకొంది. బాలుడిని తీసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది. రాష్ట్ర మంత్రి హరీష్‌రావు సంఘటన స్థలం వద్ద జరుగుతున్న వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్‌ద్వారా మంత్రి హరీష్‌ ‌రావు పర్యవేక్షించారు. సంఘటన స్థలం వద్ద తల్లిదండ్రులు నవీన, గోవర్ధన్‌ ‌రోధించడం అక్కడున్న వారిని కలిచి వేసింది. గురువారం తెల్లవారుజామున సహాయక బృందాలు మళ్లీ చేపట్టగా బాలుడు ఊపిరాడక మృతి చెందినట్లు గుర్తించారు 25 అడుగుల లోతులో ఉన్న బాలుడు నీ నీ యంత్రాల సాయంతో బయటకు తియ్యగా మృతదేహం చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి వెంటనే మెదక్‌ ‌ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బాలుడి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు అనంతరం వైద్యులు తల్లిదండ్రులకు బాలుడి మృతదేహాన్ని అప్పగించారు.

Leave a Reply