Take a fresh look at your lifestyle.

దివ్యక్షేత్రంలో పస్తులుండకూడదనే మా ధ్యేయం

కరోనా మహామ్మారి బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో భద్రాచలం లో చిక్కుకు పోయిన భక్తులు, వలస కార్మికులు,యాచకులకు, ఆకలితో అలమటిస్తూ తినడానికి తిండి ఉండడానికి గూడు లేక విలవిలలాడుతున్న నిరాశ్రయులకు, స్వగ్రామాలకు వెళ్లలేక భద్రాచలం లొనే ఉండిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు ‘‘కీ.శే.బూసిరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్‌ ‌ట్రస్ట్’’ ‌పేరుతో డా.బూసిరెడ్డి శంకర్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో నేటికి 26 రోజులుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం లో భాగంగా పార్సిల్‌ ‌చేసి సిద్ధంగా ఉంచిన 350 భోజన పొట్లాలను డా.బూసిరెడ్డి శంకర్‌ ‌రెడ్డి అన్నపూర్ణ దంపతులు స్వయంగా పంపిణీ చేశారు.గురువారం నాడు భోజనం లో బూసిరెడ్డి శంకర్‌ ‌రెడ్డి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ప్రత్యేకంగా చేయించిన చక్కర పొంగలి, ఉడకబెట్టిన కోడి గుడ్డు టొమాటో కూర తో పాటుగా, చట్నీ, సాంబారు పెరుగు లతో పాటుగా భోజన పొట్లాలను పంపిణీ చేశారు.

- Advertisement -

మరియు పట్టణంలోని వివిధ ప్రాంతాలలోని అన్నార్తులకు భోజన పొట్లాలను బూసిరెడ్డి శంకర్‌ ‌రెడ్డి తన కారు లో పంపి అన్నార్తులను ఆదుకున్నారు.అన్నపూర్ణా ఫంక్షన్‌ ‌హాలు లో ఆశ్రయం ఉంటున్న నిరాశ్రయులకు ఉదయం అల్పాహారం తో పాటుగా రెండు పూటలు భోజనం ఏర్పాటు చేస్తున్నట్టు డా.బూసిరెడ్డి శంకర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.అడుసుమిల్లి జగదీష్‌, ‌గాదేమాధవరెడ్డి, న్యాయవాది పామరాజు తిరుమలరావు, బాచినేని రామకృష్ణలతో పాటుగా, తొలి రోజునుండీ ఉచితంగా సేవలందిస్తున్న సేవాబృంద సభ్యులు గంజి సంపత్‌, ‌వంటమాష్టరు జబర్దస్త్ ‌రమేష్‌, ‌హైదరాబాద్‌ ‌వంట మాస్టర్‌ ఉపేందర్‌ ‌సింగ్‌, ‌కావూరి ప్రభాకర్‌, ‌కాకరాల శ్రీనివాసశర్మ, యాకుబ్‌ ‌రెడ్డి, బిందు ప్రభాకర్‌, ‌రాంగోటి గిరి, కొండారెడ్డి, రమేష్‌, ‌సన్నీ, సాహిత్‌, ‌రామచందర్‌, ‌గుండే రామారావు, హసీనా, నూర్జహాన్‌, ‌షేక్‌ ‌మీరా అన్వేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply