గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతర గోల్కొండ బోనాలతో ఆదివారం ప్రారంభం కానుంది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఆదివారం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో.. ఈ ఉత్సవం నగరమంతటా మొదలవుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం లష్కర్లో ఆ తర్వాత లాల్ దర్వాజా, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో నెలంతా ఈ బోనాల పండుగ జరుపుకోనున్నారు.
నగరాల్లో తర్వాత జిల్లాల్లోనూ ఈ బోనాల పండుగను జరుపుకుంటారు. నేటినుంచి బోనాల పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలో రెండేళ్ల తరవాత సందడి మొదలయ్యింది. విద్యుత్ దీపాలతో అమ్మవారి గుడిని అలంకరించారు.