Take a fresh look at your lifestyle.

‘‘బొమ్మతో పాటు పలక కావాలి’’

“జూలై 22 నుండి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు  అందజేయడం జరిగింది. విద్యార్థులకు పెద్దగా సమాచారం ఇవ్వక పోయినను ఎక్కువ సంఖ్యలో హాజరై పుస్తకాలు అందుకున్నారు. సాధారణ రోజుల్లో పాఠశాల తెరిచిన రోజు సహజంగా చాలా తక్కువ మంది హాజరయ్యేవారు. దీన్నిబట్టి పిల్లల్లో పాఠశాలకు వెళ్లాలని తెరువాలనే బలమైన కోరిక ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు ఎప్పుడు తెరవాలనే అంశం మీద విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాన్నిసేకరించి పంపమన్న ఆదేశంతో పాఠశాలలో ఆగస్టు మూడవ వారం లేదా సెప్టెంబర్‌ ‌నెలలో పాఠశాలలు ప్రారంభించాలని అభిప్రాయాలను తెలిపినారు. కనుక పాఠశాలలు తెరవడానికి అనుమతించి ప్రణాళికలు తయారుచేస్తే బాగుంటుంది కదా! అలా కాకుండా తరగతి గదికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ ‌బోధన చేయాలని పలువురు సూచించడం, సూచనగా బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అది సాధ్యపడదు.”

కొరోనా కష్టకాలంలో గత నాలుగు నెలలుగా బొమ్మ (సినిమా )ఆడక పలక (బడులు)మీద రాతలు లేక ప్రజా సమూహం మానసిక ఆందోళన భయబ్రాంతుల తో అసత్యపు అబద్ధపు కొరోనా ప్రచారాలతో బిక్కుబిక్కుమంటూ కాలాన్ని సాగదీస్తున్న నేపథ్యంలో వ్యవస్థలన్నీ లాక్‌డౌన్‌లతో అవస్థలు పడుతుంటే కనికరించి ఇప్పుడిప్పుడే అన్లాక్‌ అవుతుంటే ఒకటి రెండు దశలు ముగిసి మూడవ దశలో కి అడుగుపెడుతున్న ఈ సమయంలో బొమ్మ స్క్రీన్‌ ‌పైపడుతుందని న్యూస్‌ ‌రీల్‌ ‌నడుస్తున్న పరిణామంలో అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు నిరంతర శ్రమ చేసే పలక కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులోకి వస్తే బాగుంటుంది. కొరోనా వైరస్‌ ఉదృతి నుండి రక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్‌ ‌డౌన్‌ ‌ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ ప్రక్రియను దశలవారీగా అమలు చేశారు .దీంతో పలు రంగాలు స్తంభించిపోయాయి. ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి ..ఆర్థిక ,సామాజిక సంక్షోభాలను సృష్టించి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ప్రమాద సూచికలను ఎగర వేస్తూ గొప్ప మేధస్సు కలిగిన మానవ సమాజాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. లాక్‌ ‌డౌన్‌ ‌విధించడంతో ప్రజలందరూ మనుగడ సాధించడానికి తీవ్ర ఇబ్బందులకు గురై తమ అస్తిత్వాన్నినిలబెట్టుకోవడానికి కొనసాగింపుగా ప్రభుత్వాలు తిరిగి అన్లాక్‌ ‌ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఇది కూడా దశలవారీగా కొనసాగిస్తూ ఒకటి రెండు దశలు ఈనెలాఖరుకు ముగియనున్నాయి. ఆగస్టు ఒకటి నుండి మూడవ దశ ప్రారంభం కానున్న ఈ సందర్భంలో పాటించవలసిన నియమ నిబంధనలను మార్గదర్శకాలను పొందుపరచడం జరుగుతుంది.ఒకట వ రెండవ దశలో జనజీవనం మామూలు స్థితికి రావడానికి అవసరమైన వాటికి అనుమతించడం జరిగింది. కానీ ఒత్తిడి శ్రమ నుండి ఉపశమనం కలిగించే వినోద కేంద్రాలు భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యా వికాస కేంద్రాలు తెరుచుకోలేదు. ప్రస్తుతం మూడవ దశలో కొన్ని షరతులతో సినిమా హాల్‌ ‌లకు ఆగస్టులో అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. గత మార్చి నెలలో సినిమా హాలు, జిమ్‌లు మరియు పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో వాటి మీద ఆధారపడి జీవించే 240 అనుబంధ రంగాలకు చెందిన వారు చిరు వ్యాపారులు, సినిమా కార్మికులు, యాజమాన్యాలు తదితరులు అందరూ ఉపాధిని కోల్పోయి నిత్యావసర సరుకులకు కనీస అవసరాలను తీర్చుకోలేని దీనావస్థ కుచేరుకున్నారు. కొంతమంది ప్రముఖహీరోలు ఆర్థిక సహాయం చేసి సిని రంగ కార్మికులను ఆదుకోవడం అభినందనీయం.

అన్‌లాక్‌ 1,2 ‌దశలలో సినిమా హాల్‌లకు పాఠశాలలకు తెరుచుకునే భాగ్యం కలగలేదు. మూడవ దశలో ఆ ప్రస్తావన కు వస్తుండడంతో ఆరంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆశలు చిగురించాయి. నేటి ఉరుకుల పరుగుల వ్యవస్థలో నిరంతర శ్రమ మానసిక ఒత్తిడితో కూడిన వ్యయప్రయాసలు నుండి సేదతీరేందుకు ఉల్లాసం ఉత్సాహం లను పెంపొందించుకునేందుకు అవసరం అయ్యేవినోదా లయాలు తెరుచుకోవడం సమంజసమే… అదేవిధంగా దేశ ప్రగతికి కీలకమైన మానవ వనరులను అభివృద్ధి పరిచేందుకు విజ్ఞానాన్ని అందించి జీవన వికాసానికి తోడ్పడే విద్యాలయాలను కూడా తెరిచేఅవకాశాన్ని పరిశీలించాలి. లాక్‌ ‌డౌన్‌ అన్‌లాక్‌• అవడంతో ప్రతి రంగంలో పనులు మొదలయ్యాయి. ప్రజలందరూ వారి వారి పనుల్లో నిమగ్న మయ్యారు. రిటైల్‌ ఆతిథ్య పర్యాటక రంగాలకు దగ్గర వారీగా కొన్ని ఆంక్షలతో అనుమతి ఇవ్వడం జరిగింది. వివాహ వినోద విందులు ప్రారంభం అయ్యాయి. అన్ని సాధారణ కార్యక్రమాలు సజావుగా ఆటంకం లేకుండా సాగుతున్నాయి. బడుగు బలహీన వర్గాలకు చెందిన అవసరమయ్యే పూర్తి స్థాయిలో, నిరుపేదలు పనిచేసే సినిమా హాలు ఆటపాటలతో హాయిగా ఉల్లాసంగా గడుపుతూ విద్యను సముపార్జించేందుకు, దేశ భవిష్యత్తు లు నిర్మించే తరగతి గదులు తాళాలతో ఉండటం శోచనీయం. గతంలో ఎన్నో వైరస్‌ ‌లు మానవ సమాజం పై దాడి చేశాయి. వైరస్లు కలిగించిన మరణాల రేటు పరిశీలించినట్లయితే మార్‌ ‌బర్గ్-80%, ఎబోలా 40 .4%, హేండ్రా-57%,హెచ్‌5ఏన్‌1-52.8%, ‌నిఫా-77.6% సార్స్-9.6%,‌హెచ్‌1ఎన్‌1-0.02%, ఎంఇఆర్‌ ఎస్‌-34.4%,‌హెచ్‌7ఎన్‌9-39.3%,2019ఎన్‌ ‌కరోనా-2.2%. గా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని బట్టి కొరోనా ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది డ్రాప్‌ ‌లేట్‌ ‌ద్వారా మాత్రమే సంక్రమిస్తుందని దాని నుండి తప్పించుకోవడానికి సామాజిక దూరం మాస్కులు ధరిస్తే చాలు అంటున్నారు పరిశోధకులు. ఈ వైరస్కు వ్యాక్సిన్‌ ‌రావడం సమయం పడుతుండడంతో దానితో సహజీవనం చేయాలని చెబుతూ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రికవరీ రేటు ఎక్కువగా మరణాల రేటు తక్కువగా ఉందని పాలక పెద్దలు అంటున్నారు. నిజమే కావచ్చు ఈ వైరస్‌ ‌ప్రారంభంలోనే అలక్ష్యం చేయకుండా అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకుంటే బాగుండేది .ఫలితంగా దాని పర్యావసనం ను అనుభవించు చున్నాము. ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్న ,పాఠశాలలు, సినిమా హాల్‌ ‌మాత్రమే మూసి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సామాజిక దూరం ను పాటిస్తూ అవతరణ దినోత్సవం ,హరితహారం లాంటి కార్యక్రమాలు జరిగినాయి. జూలై 22 నుండి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయడం జరిగింది. విద్యార్థులకు పెద్దగా సమాచారం ఇవ్వక పోయినను ఎక్కువ సంఖ్యలో హాజరై పుస్తకాలు అందుకున్నారు.

సాధారణ రోజుల్లో పాఠశాల తెరిచిన రోజు సహజంగా చాలా తక్కువ మంది హాజరయ్యేవారు. దీన్నిబట్టి పిల్లల్లో పాఠశాల కు వెళ్లాలని తెరువాలనే బలమైన కోరిక ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు ఎప్పుడు తెరవాలనే అంశం మీద విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాన్ని సేకరించి పంపమన్న ఆదేశంతో పాఠశాలలో ఆగస్టు మూడవ వారం లేదా సెప్టెంబర్‌ ‌నెలలో పాఠశాలలు ప్రారంభించాలని అభిప్రాయాలను తెలిపినారు. కనుక పాఠశాలలు తెరవడానికి అనుమతించి ప్రణాళికలు తయారుచేస్తే బాగుంటుంది కదా! అలా కాకుండా తరగతి గదికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ ‌బోధన చేయాలని పలువురు సూచించడం, సూచన గా బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అది సాధ్యపడదు. నేను కూడా ఉపాధ్యాయునిగా ఆన్‌లైన్‌• ‌బోధన ప్రారంభించేందుకు ఈ ప్రయత్నంలో భాగంగాఇరవై ఎనిమిది మంది గల పదవ తరగతిలో 7గురికిమాత్రమే స్మార్ట్ ‌ఫోన్స్ ఉన్నాయని తెలిసింది. అవికూడా వారి సోదర సోదరీమణులు ఉన్నత స్థాయి విద్య లో భాగంగా ఆన్‌లైన్‌ ‌క్లాసులు వినుటకు ఉపయోగిస్తున్నారు. మరి ఆన్‌లైన్‌ ‌బోధన ఎలా సాధ్యం? ఇది మా పాఠశాల లోనే కాదు.చాలా పాఠశాలల్లో ఈ సమస్య ఉండి ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌• ‌బోధన జరుగుతున్న కొన్ని ప్రవేటు పాఠశాలల కళాశాలల విద్యార్థులనుగమనిస్తే.. రోజుకు 4,5 క్లాసులు నిర్వహించడం మూలంగా వాటిని వినలేక సిగ్నల్‌ అం‌దక విసిగి అనాసక్తితో వింటున్న దృశ్యం అనిపించింది. ఆన్‌లైన్‌ ‌బోధన అనేది ఒక బోధన ఉపకరణం లాగానే ఉపయోగపడుతుంది .తప్ప తరగతి గదికి ప్రత్యామ్నాయం కాదు. ఇస్రో మాజీ చైర్మన్‌ ‌కస్తూరి రంగన్‌ అన్నట్లు ప్రత్యక్ష బోధన తోనే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించవచ్చు. బుద్ధికుశలత సృజనాత్మకత అభివృద్ధి చెందడంలో ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య ప్రత్యక్ష మానసిక సంబంధాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సజీవ సంబంధాన్ని కలిసి ఉంటేనే విద్యార్థుల మానసికస్థితిని అర్థం చేసుకొని వారికి అనుగుణంగా విద్యాబోధన భావిస్తారు. ఆన్‌లైన్‌• ‌విధానంలో అలా ఉండదు. ఆన్‌లైన్‌• ‌విద్య విద్యారంగ పరిష్కారం కాదు. కొరోనా ప్రభావంతో చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు, ఉపాధి కొరతతో సతమతమవుతున్న పేదలు మధ్యతరగతి వర్గాల పిల్లలు, ఇంటర్నెట్‌ ‌డేటా స్కూల్‌ ‌ఫీజు స్మార్ట్ఫోన్లు కంప్యూటర్లు కొనలేని స్థితిలో ఆన్‌లైన్‌• ‌విద్యను ప్రోత్సహించటం వారిని మరింత కుంగదీస్తుంది. కరోనా వల్ల 91 శాతం పిల్లలు పాఠశాల విద్యకు దూరం అయినట్లు సేవ్‌ ‌ద చిల్డ్రన్‌ ‌ఫండ్‌ ‌సంస్థ నివేదికలో వెల్లడించింది. ఇలాంటి సమయంలో డిజిటల్‌ ‌విద్య ఆన్‌లైన్‌• ‌విద్య కు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇస్తే బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో విద్యా వ్యవస్థకు ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న దాని పై విద్యావేత్తలతో మేధావులతో సామాజిక సంస్థల తో చర్చించి. పూర్తి రక్షణ చర్యలు చేపట్టి పాఠశాలలు తెరిచే టందుకు తగు నిర్ణయం తీసుకోవాలి.

అన్లాక్‌ ‌మూడో దశలో ఆగస్టులో బొమ్మ ఆడేందుకు సినిమా థియేటర్లు తెరవ వచ్చు అనే వాదనలు మొదలైనవి. సినిమా థియేటర్లు తెరిచేందుకు 25% సీటింగ్‌ ‌సామర్థ్యం ,థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ,‌సానిటైజింగ్‌ ‌వంటి ఏర్పాట్లు చేసుకోవాలనే నిబంధనలు ఉంటాయి. అయితే వీటిని అనుసరించి థియేటర్లు తెరవాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా( వీ•×) ఆరాట పడుతూ ఉంటే మరికొన్ని రోజులు ఆగుదామని సింగిల్‌ ‌స్క్రీన్‌ ‌థియేటర్ల యజమానులు అంటున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించే సిటింగ్‌ ‌సామర్థ్యం ఆమోద యోగ్యం కాదని దానివల్ల వచ్చే డబ్బు సానిటైజ్‌ ‌ఖర్చులు, ఏసీ కరెంట్‌ ‌ఖర్చులు భరించడం కష్టసాధ్యమని సింగిల్‌ ‌స్క్రీన్‌ ‌యజమానులు అంటున్నారు. ఇప్పటికి నాలుగు నెలలు మూతబడి ఉన్నప్పటికీ లక్షలాది రూపాయలు కరెంటు బిల్లులు,యూజర్‌ ‌ఛార్జిస్‌ ‌చెల్లించడం భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుండగా, తెరిచిన ఈ కొరోన కాలంలో ప్రేక్షకులు వస్తారా అనే సందేహం కలదు.పెద్ద సినిమాలు వచ్చే ఏడాది కి వాయిదా పడ్డాయని ఇప్పుడు థి యోటర్లు తెరిచిన ఏమి లాభం ఉండదని, కొరోన పాజిటివ్‌ ‌కేసులు లేదా లక్షణాలు లేకుండా కొరోనా సోకిన వాళ్ళు సినిమాకు వస్తే ఆ వైరస్‌ ‌థియేటర్‌ అం‌తట పాకుతుంది అనే భయాలు ఉండగా ఈ విషయమై మల్టీప్లెక్స్ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా, సింగిల్‌ ‌స్క్రీన్‌ అసోసియేషన్‌ ‌యజామాన్యాలతో చర్చించి అనుమతి ఇస్తే బాగుంటుంది. ఇటువంటి పరిస్థితులు పాఠశాలలో ఉండవు .పిల్లలందరూ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటారు సామాజిక దూరం పాటింప జేసి , సానిటైజర్లు మాస్కులు అందజేసి షిప్‌ ‌నెలవారీగా విద్యాబోధన చేయవచ్చు. మధ్యాహ్న భోజనం బలవర్ధకమైన దిగా పౌష్టికాహారాన్ని అందజేస్తే రోగనిరోధక శక్తి ని పెంపొందించవచ్చు గ్రామీణ ప్రాంతాలలో పేద విద్యార్థులు సరి అయిన భోజనం అందక, చిన్నకుటుంబాలలో తల్లిదండ్రులు పనులకు వెళితే వీళ్ళ ఆలనా పాలనా చూసే వారు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాదాలను సైతం కొని తెచ్చుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు ఉన్నారు. పిల్లలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగానే ఉంటుందని కొన్ని పకడ్బందీ జాగ్రత్తలు తీసుకొని, కొంత ఖర్చు వెచ్చిస్తే పాఠశాలలు తెరువ వచ్చని నిపుణులు అంటున్నారు. పాఠశాలలు కళాశాలలు తెరవడం ద్వారా కొరోనా కు సమూహరోగనిరోధక శ క్తి (హెర్డ్ ఇ ‌మ్యూనినటీ)సాధించ వచ్చని ఎయిమ్స్ ‌డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఏ దైనా వైరస్‌ ‌విలయతాండవంచ చేస్తున్నప్పుడు దానిబారి నుండి కాపాడుకోవడానికి రెండేమార్గాలు ఉన్నాయ ని…1)వ్యాక్సిన్‌ 2)‌హెర్డ్ ఇమ్యూనిటీ.. పిల్లల రోగనిరోధక శక్తి తాజాగా వుంటుందని వారు దాన్ని సమర్ధంగా ఎదుర్కొనిహెర్డ్ ఇమ్యూనిటీ సాధించే అవకాశం ఉందని, మూసివేసిన పాఠశాలలను కోవిడ్‌ ‌నిబంధనలకుఅ అనుసరించితెరిచి హెర్డ్ ఇమ్యూనిటీ సాదించడమే ఏకైక పరిష్కారమని అన్నారు.

ఈ విశ్వ మారి విజృంభన నుండి కాపాడుకోవడానికి ఇక ముందు కూడా సంభవించే వైరస్‌ ‌ల ధాటికి నిలబడి పోరాడేందుకు నిరంతరం వైద్య రంగా పరిశోధనలు జనాభా పరంగా డాక్టర్లను తయారు చేసుకోవడం హాస్పిటల్స్ ‌ను వాటిలోని సిబ్బందిని పరికరాలను అందుబాటులోకి తెచ్చుకోవాలి. అప్పుడే ఈ సంక్షోభం నుండి బయటపడవచ్చు. ఇకముందు సంభవించకుండా ముందు జాగరూకతతో నిరోధించవచ్చు. అలా సాధ్యం కావాలంటే ఏలికలు విద్య వైద్య రంగాలను ప్రభుత్వ అధీనంలోనే ఉంచుకొని అధిక నిధులు కేటాయించాలి.సామాజిక బాధ్యత తో ప్రజావిద్య, ప్రజారోగ్యాలను సంరక్షించే విధానాన్ని ఈ కొరోనా సంక్షోభాన్ని గుణపాఠం గా తీసుకొని ,అనుత్పాదక వ్యయం అని అనుకోకుండా నిధులను సమకూర్చి అభివృద్ధి పరిచినప్పుడే ప్రజాలందరు సుభిక్షంగా వుంటారు .అప్పుడే భావి భారత పౌరులు భవిష్యత్తు తరాలకు పునాది రాళ్లు గా బొమ్మ ,పలకలతో హాయి గా జీవనాన్ని సుఖమయం చేసుకుంటారు.

thandaa sadhanandham
తండా సదానందం, జిల్లా
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్‌. ‌మహబఃబాద్‌ ‌జిల్లా. 9989584665

Leave a Reply