బాంబులు పెట్టినట్లు హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు అగంతకుడి నుంచి మెయిల్‌ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. రాజ్‌భవన్‌, పాత బస్తీలోని సిటీ సివిల్‌ కోర్డు, జింఖానా క్లబ్‌, సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్‌ చేశాడు. పోలీసులు అప్రమత్తమై బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌లతో చేరుకుని ఆయా ప్రదేశాల్లోనుంచి అందరినీ ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పాత బస్తీలోని సిటీ సివిల్‌ కోర్టులో కార్యకలాపాలను నిలిపివేశారు. అన్నా యూనివర్సిటీ పూర్త విద్యార్థుల పేరుతో తెల్లవారుజామున 3.15గంటలకు మెయిల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు,అయితే ఇప్పటివరకు బాంబు తదిరత పేలుడు వస్తువులు లబభించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *