Take a fresh look at your lifestyle.

గూగుల్‌ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్‌

ముంబై, ఫిబ్రవరి 13 : మహారాష్ట్ర పూణేలోని గూగుల్‌ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్‌ ‌వచ్చింది. ఆఫీసులో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ ‌కాల్‌ ‌చేసి చెప్పడంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆఫీసును క్షుణ్ణంగా పరిశీలించి బాంబ్‌ ‌స్క్వాడ్‌ అది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ అని తేల్చింది. హైదరాబాద్‌ ‌కు చెందిన శివానంద్‌ అనే వ్యక్తం మద్యం మత్తులో ఫోన్‌ ‌కాల్‌ ‌చేసినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

పుణెలోని ముంద్వా ప్రాంతంలోని ఓ కమర్షియల్‌ ‌బిల్డింగ్‌ 11‌వ ఫ్లోర్‌లో గూగుల్‌ ఆఫీస్‌ ఉం‌ది. ఆఫీసులో బాంబు పెట్టానంటూ ఓ అజ్ఞాతవ్యక్తి ఆదివారం రాత్రి ఫోన్‌ ‌చేశాడు. దీంతో పుణెళి పోలీసులు, బాంబ్‌ ‌డిస్కోజల్‌ ‌స్క్వాడ్‌ అక్కడు చేరుకుని గాలింపు చేపట్టినట్లు జోన్‌-5 ‌డీసీపీ విక్రాంత్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌చెప్పారు. అది ఫేక్‌ ‌కాల్‌ అని తేలడంతో కాలర్‌ ఆచూకీ ట్రేస్‌ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌లో అతన్ని అదుపులోనికి తీసుకున్నామని, కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు డీసీపీ దేశ్‌ముఖ్‌ ‌ప్రకటించారు.

Leave a Reply