Take a fresh look at your lifestyle.

బొల్లారం వింధ్యా ఆర్గానిక్‌ ‌పరిశ్రమలో పేలిన రియాక్టర్‌

పలువురికి గాయాలు, హాస్పిటల్‌కు తరలింపు

పటాన్‌చెరు నియోజకవర్గంలోని  ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని వింధ్యా ఆర్గానిక్‌ ‌పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో పరిశ్రమ నుంచి కార్మికులు పరుగులు తీశారు. మరికొందరు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే భయంతో చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులూ పరుగులు తీశారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిదిమంది కార్మికులకు గాయాలు కావడంతో వారిని బాచుపల్లి హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 4 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొన్ని అగ్నిమాపక శకటాలను తెప్పించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం సంభవించడంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ్రమలోని రియాక్టర్‌ ‌పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.

Leave a Reply