Take a fresh look at your lifestyle.

మంత్రి పుట్టిన రోజు సందర్భగా 5లక్షల ఆర్థిక సహాయం చేసిన బొల్లం

సూర్యాపేట(కోదాడ) జులై 24, ప్రజాతంత్ర ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామరావు జన్మదినం సందర్భంగా జిల్లా పరిధిలోని కోదాడ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కేక్‌కట్‌ ‌చేసి, మొక్కను నాటి అనంతరం బాలాజీ నగర్‌కు చెందిన మహ్మద్‌ ‌హబీబా తరణం అనే 5సంవత్సరాల పాప పుట్టుకతో మూగ, చెవిటి సమస్యలతో బాధపడుతుందని తెలుసుకొని శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు 5లక్షల చెక్కును అందజేయడం జరిగిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పుట్టుకతో మూగ, చెవిటి సమస్యలతో వున్న ఆ చిన్నారి ఆపరేషన్‌కు 10లక్షల కొటేషన్‌ను డాక్టర్‌ ఇవ్వడంతో గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 5లక్షలను అందజేయడం జరిగిందని, ఈ సారి మంత్రి పుట్టిన రోజు సందర్భంగా మిగిలిన 5లక్షలను అందజేశామని పేర్కొన్నారు.

తన కూతురు ఆపరేషన్‌కు 10లక్షల ఖర్చు అవుతుందని తెలియగానే ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ‌దృష్టికి తీసుకొని రావడం జరిగిందని, వెంటనే వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5లక్షలు, తన జీతం నుండి 5లక్షలు అందించారని, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు రుణపడి ఉంటామని అన్నారు. నాయకుల పుట్టిన రోజు సందర్భంగా కేకులు,మొక్కలంటూ ఫోటోలకు ఫోజులిచ్చే ఈ రోజుల్లో కేటీఆర్‌ ‌పుట్టిన రోజు సందర్భంగా 5లక్షల చెక్‌ను అందజేసి తమ కుటుంబంలో ఆనందం నింపారని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!