Take a fresh look at your lifestyle.

ఏదో ఉద్దరించినట్లు ప్లీనరీలో ప్రగల్భాలు

  • కెసిఆర్‌ ‌చెప్పేవన్నీ అబద్దాలే అన్న పొన్నాల
  • పెట్రో ధరలతో బిజెపి దెబ్బతీస్తుందన్న విహెచ్‌

ప్లీనరీలో కేసీఆర్‌ ఏదో పొడిచినట్టు గొప్పగా మాట్లాడారని కాంగ్రెస్‌ ‌నేత పిసిసి మాజీ చీఫ్‌ ‌పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రజలను ఏ ఉద్దరించారని ప్రశ్నించారు. మంగళవారం వి•డియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత వొచ్చిన పరిశ్రమలు ఎన్ని పెరిగిన ఎగుమతులు ఎన్నని  ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో వొచ్చిన పరిశ్రమలు వ్యాపార విస్తరణలో భాగంగా ఎక్స్‌పోర్టస్ ‌పెరిగాయని…అది తమ అకౌంట్‌లో ఎలా వేసుకుంటారని నిలదీశారు.

కేసీఆర్‌ ‌నువ్వొక మూర్ఖుడివని మండిపడ్డారు. ఎదుటివారి సలహాలు సూచనలు కూడా తీసుకోలేరన్నారు. కాళేశ్వరం పూర్తయితే అదనంగా ఒక్క ఎకరనికైనా నీరిచ్చారా?  అని అడిగారు. కేసీఆర్‌ ‌చెప్పినవన్ని దొంగ లెక్కలు, మాయ మాటలని విమర్శించారు. హుజురాబాద్‌లో ఏ మొహం పెట్టుకొని వొట్లు అడుగుతారని అన్నారు. కేసీఆర్‌ ‌సీఎం అయ్యాక ఈడీ వొచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అమెజాన్‌, ‌గూగుల్‌ ‌కూడా కాంగ్రెస్‌ ‌హయాంలో వొచ్చినవే అని పొన్నాల చెప్పుకొచ్చారు.

ఇకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వొచ్చాక సామాన్యుడి నడ్డి విరిచేలా పెట్రోల్‌ ‌ధరలు భారీగా పెంచారని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత వి హనుమంతరావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌హయాంలో 50 రూపాయలు ఉన్న పెట్రోల్‌ ‌ధర ఇప్పుడు 110 రూపాలకు చేరిందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు దేశ ప్రజలను గ్యాస్‌, ‌పెట్రోల్‌ ‌పేరుతో దోచుకుంటున్నాయన్నారు. పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్‌ ‌పోరాటం చేస్తుందని వీహెచ్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply