Take a fresh look at your lifestyle.

రక్తదానం ప్రాణదానంతో సమానం : ఎంపీ నామ

ఖమ్మం,మే 2 ప్రజాతంత్ర ప్రతినిధి) : రక్తదానం చేయడం అంటే ప్రాణాలను కాపాడటమేనని ఖమ్మం పార్లమెంట్‌ ‌సభ్యుడు నామ నాగేశ్వరరా వు అన్నారు. శనివారం సత్తుపల్లిలో స్ధానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య , మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కూసంపూడి  మహేశ్‌  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని  ఎంపీ నామ నాగేశ్వరరావు  ప్రారంభించారు. ఈ సం దర్బంగా జరిగిన సభలో నామ మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో 500 మంది రక్తదానం చేయడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలో తలసేమియా బాధితులకు 8 లక్షల  లీటర్ల రక్తం అవసరం ఉందన్నారు.  కరోనా వల్ల రక్తదా నానికి దాతలు ముందుకు రావడం లేదన్నారు.ఈ పరిస్దితుల్లో  మహేశ్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్రా సరిహద్దుల్లో ఉందని, ••ల్లూరుకు ఆనుకుని ఉన్న తిరువూరు రెడ్‌జోన్‌ ‌లో ఉందన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే సండ్ర వెంక• వీరయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. కరోనా ఎదుర్కోవడంతో పాటు  మిగిలిన ప్రాంతాల వారికి సత్తుపల్లి వాసులు అండగా నిలబడుతు న్నారని అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మూగ జీవాల ఆకలి తీర్చడానికి  100 ట్రాక్టర్ల గడ్డిని సేకరించి, ఖమ్మం గోశాలకు ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం ట్రస్ట్ ‌ద్వారా ఏర్పాటు చేసిన శానిటైజర్‌, ‌మాస్కులు  నామ ఎమ్మెల్యే  సండ్రకు అందజేశారు. ఈ కార్యక్రమాలో  జిల్లా కలెక్టర్‌ ఆర్‌.‌వి.కర్ణన్‌, ఎమ్మెల్యే సండ్ర వెంక• వీరయ్య, టీఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మున్పిపల్‌ ‌చైర్మన్‌ ‌కూసంపూడి మహేశ్‌ , ‌డాక్టర్‌ ‌కూసంపూడి నరసింహారావు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ‌మువ్వా  విజయబాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సత్తుపల్లిలో నామ ముత్తయ్య ట్రస్ట్ ‌తరఫున  నిరు పేదలకు నామ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌కు నామ నాగేశ్వరరావు  శానిటైజర్‌,‌మాస్కులు అందజేశారు.

నాగప్రసాద్‌ ‌కుటుంబానికి పరామర్శ
నాగుపల్లిలో  ఇటీవల  మృతి చెందిన కండిమళ్ల నాగ ప్రసాద్‌ ‌కుటుంబాన్ని నామ పరామర్శిం చారు.  నాగ ప్రసాద్‌ ‌చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. మృతుని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నామ భరోసా ఇచ్చారు. అవుట్‌ ‌పోస్టు వద్ద తొలుత నామకు   వైద్య , ఆరోగ్య శాఖ సిబ్బంది టెంపరేచర్‌ ‌చెక్‌ ‌చేశారు. ఉష్ణోగ్రత సాధారణమేనని  నిర్ధారణ తర్వాత  ఎంపీని నాగుపల్లి  గ్రామంలోకి అనుమతించారు. అనంతరం గ్రామం వెలుపల ఉన్న చెక్‌పోస్టును సందర్శించి, లాక్‌డౌన్‌ ‌పరిస్ధితులు, ప్రజల సాధకబాధకాలు, బందోబస్తు  గురించి  సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply