“ఆనాడు బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు విధానాన్ని అనుసరించారు.ఇప్పుడు అందుకు భిన్నంగా ఏమైనా జరుగుతోందా అప్పటి కన్నా తీవ్రమైన నిర్బంధం సాగుతోంది. ఆనాడు బ్రిటిష్ వారు భారత ఖండాన్నివిభజించారు.ఇప్పుడు మోడీ ప్రజల మనసులను విడగొడుతున్నారు. ఈద్, హోలీ తదితర పండు•గలు మతపరమైనవి కావు. ప్రజల మధ్య సామాజిక బంధాన్ని పెంచేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతోంది. సమాజంలో బలహీనవర్గాలను ఈ ప్రభుత్వం అణగదొక్కు తోంది. అని ఆయన ఆక్రోశాన్ని ప్రకటించారు. హక్కుల కోసం పోరాడే వారిని ఈ ప్రభుత్వం ఖలిస్తానీలనీ, పాకిస్తానీలని ముద్రవేస్తోంది. సంఘ వ్యతిరేక శక్తులని ఆరోపిస్తోంది… అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.”
- ఇలాంటి భారత దేశం కోసం కాదు మేము పోరాడింది
- నూట పదేళ్ల రైతు గంధర్వ సింగ్ వలస పాలకులైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గతంలో పోరాడిన గంధర్వ సింగ్ ఇప్పుడు సాగుచట్టాల రద్దు కోసం మోడీ ప్రభుత్వం తో పోరాడుతున్నారు.
తరుషి అశ్వని, ‘ది వైర్’ సౌజన్యంతో
న్యూఢిల్లీ : గుప్పిట చేతికర్ర వణుకుతున్నా, నూటపదేళ్ళ గంధర్వ సింగ్ లో ఏమాత్రం చేవ తగ్గలేదు. ఉత్తరప్రదేశ్ ఎటావా జిల్లా నుంచి ఢిల్లీ సమీపంలో జరుగుతున్న రైతుల ఆందోళనలో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ నుంచి ఆయన వచ్చి తన పేరు నమోదు చేసుకున్నారు. ఏడు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నో నల్ల చట్టాలను తెచ్చిందనీ, వాటిలో రైతులకు ప్రాణకంటకమైన చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్నఉద్యమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఇక్కడ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఆయన ఆందోళనలో పాల్గొంటున్నారు. బ్రిటిష్ వారితో పోరాడే సమయంలో తాను ముప్పయి ఏళ్ళ వయసు వాడిననీ,ఈ రోజు రైతుల పోరాట స్ఫూర్తి, కృత నిశ్చయం చూస్తుంటే,ఆనాటి దృశ్యాలు గుర్తుకు వస్తున్నాయని ఆయన అన్నారు. రోజులు మారినా రైతుల జీవన విధానంలో మార్పులు రాలేదనీ,రైతుల గురించి జరుగుతున్న ఆందోళనలో పాల్గొనడం తన కర్తవ్యంగా భావించానని ఆయన చెప్పారు.
ఆనాడు పరాయి పాలకులు మన దేశీయులను అణచివేయడానికి అనుసరించిన పద్దతులనే ఇప్పుడు మన వారే మనపైన ప్రయోగిస్తున్నారని ఆయన అన్నారు. ఆయన సూర్యోదయం అవుతున్న సమయంలో నిద్ర లేచి బీజేపీ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించమని సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తారు. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను పఠిస్తారు. ఈ ఉద్యమాన్ని నడుపుతున్న రాకేష్ తికాయత్ తో ఆయన బంధం చాలా పటిష్టమైనది. అయితే, ఎవరితోనూ పెద్దగా కలవకుండా విడిగా ఉంటారు. గొప్పలు చెప్పుకోరు. సాయంత్రం ఆ రైతుల గుడారంలో వినిపించే విప్లవ గీతాలు వింటారు. ఆనాటి వలస పాలకుల దౌష్ట్యానికీ,నేటి ప్రజాస్వామ్యం పేరిట పాలన సాగిస్తున్న పాలకుల దౌర్జన్యకర విధానాలకూ పోలిక ఉందంటారు. స్వాతంత్య్రం కోసం మేం ఆనాడు ఎన్నోకష్టాలు పడ్డాం. అవన్నీ బీజేపీ ప్రభుత్వానికి బానిసలుగా బతికేందుకు కాదు.అని ఆయన అన్నారు. బీజేపీ అప్రజాస్వామిక పాలన కోసం మేం త్యాగాలు చేయలేదు అని అన్నారు.ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పౌర ఉల్లంఘన కార్యక్రమాన్ని మహాత్మాగాంధీజీ నిర్వహించారు.ఆ కార్యక్రమం పరాయి పాలకుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా సాగింది అప్పట్లో నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ గ్రామంలో రచ్చబండ వద్ద కలుసుకునే వారం. సత్యాగ్రహాల గురించి మాట్లాడుకునే వాళ్ళం.
పౌర ఉల్లంఘన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవల్సిన చర్యల గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా అందరం కూర్చుని నిరసన తెలుపుతున్నాం. ఇక్కడ నిరసన తెలిపేందుకు వచ్చేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆనాడు బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు విధానాన్ని అనుసరించారు.ఇప్పుడు అందుకు భిన్నంగా ఏమైనా జరుగుతోందా అప్పటి కన్నా తీవ్రమైన నిర్బంధం సాగుతోంది. ఆనాడు బ్రిటిష్ వారు భారత ఖండాన్నివి భజించారు. ఇప్పుడు మోడీ ప్రజల మన సులను విడగొడుతున్నారు. ఈద్, హోలీ తదితర పండు•గలు మతపరమైనవి కావు. ప్రజల మధ్య సామాజిక బంధాన్ని పెంచేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతోంది. సమాజంలో బలహీనవర్గాలను ఈ ప్రభుత్వం అణగదొక్కు తోంది. అని ఆయన ఆక్రోశాన్ని ప్రకటించారు. హక్కుల కోసం పోరాడే వారిని ఈ ప్రభుత్వం ఖలిస్తానీలనీ, పాకిస్తానీలని ముద్రవేస్తోంది. సంఘ వ్యతిరేక శక్తులని ఆరోపిస్తోంది… అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి ప్రభుత్వం కొత్తగా ఉగ్రవాదులనే ముద్ర వేయడం కూడా చేస్తోంది.
రైతుల ఆందోళన 1940లో మహాత్మాగాంధీ నిర్వహించిన సత్యాగ్రహాన్ని తలపింపజేస్తోంది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ మిత్రుల కోసం పాటు పడుతోంది. బ్రిటిష్ పాలకుల కన్నా దారుణంగా పౌర హక్కులనూ, సామాజిక శ్రేయోభిలాషులను అణచివేస్తోంది.ఇది ఎలాంటి దేశభక్తి..? గంధర్వ సింగ్ చేతులెత్తి దీవించే శక్తి లేకపోయినా, తన గుడారం వద్దకు వచ్చి నినాదాలు చేసిన వారిని ఆశీర్వదిస్తున్నట్టు చేయి పైకి ఎత్తుతూ ఉంటారు. 2020లో ఈ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన పాల్గొనాలని అనుకున్నారు. కానీ, కొడుకులు వారించడంతో పెద్ద కొడుకు దేవేందర్ ని పంపారు. తన రక్తంలో ఇంకా వేడి తగ్గలేదనీ, దేశ భక్తి అంటే పౌరులను అణచివేయడం కాదని మోడీకి తెలియజెప్పేందుకే ఈ ఆందోళనలో పాల్గొంటున్నానని ఆయన చెప్పారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలు చీకట్లో కలిసిపోతాయని ఆయన ఆగ్రహంతో అన్నారు.