సిద్ధిపేట గవర్నమెంటు హాస్పిటల్లో తొలి ఆపరేషన్ సక్సెస్
మంత్రి హరీష్‌రావు చొరవతో మొదటి ఫలితం
సిద్ధిపేట, జూన్ 7 (ప్రజాతంత్ర బ్యూరో): కొరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు భయపెడుతున్న వ్యాది బ్లాక్ ఫంగస్. కొరోనా రోగుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న బ్లాక్ ఫంగస్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు కూడా మనం వింటున్నాం. అయితే, జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చొరవతో గవర్నమెంటు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన 50పడకల బ్లాక్ ఫంగస్ వార్డు ఏర్పాటుతో మొదటి ఫలితం వచ్చింది. బ్లాక్ ఫంగస్ నుంచి భరోసా లభించింది. సిద్ధిపేటలోని గవర్నమెంటు హాస్పిటల్ ఈఎన్టి ఫ్రొపెస్టర్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలోని వైద్యుల బృందం చేసిన కృషి ఫలితంగా సిద్ధిపేటలోని సర్కార్ దవాఖానలో బ్లాక్ ఫంగస్ తొలి ఆపరేషన్ సక్సెస్ అయింది. వివరాల్లోకి వెళ్లితే…సిద్ధిపేటకు చెందిన గౌస్మొయినొద్దీన్కు నెల కిందట కొరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, గత శుక్రవారం మ్యూకార్మైకోసిస్ అనే (బ్లాక్ ఫంగస్) ఇన్ఫెక్షన్తో గవర్నమెంటు దవాఖానలో చేరాడు. గౌస్‌కు సోమవారం ప్రొఫెసర్ నాగరాజు ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసింది. తొలి ఆపరేషనే సక్సెస్ అయింది. ఈ ఆపరేషన్ సక్సెస్‌తో సిద్ధిపేట ప్రాంత ప్రజలకు ప్రభుత్వ మెడికల్ కలాశాల దవాఖాన వైద్యులు ఆత్మవిశ్వాసం కల్పించారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే, కొరోనా, బ్లాక్ ఫంగస్‌పై మంత్రి హరీష్‌రావు సమీక్ష జరిపిన వెంటనే కీలక మార్పులు, బ్లాక్ ఫంగస్‌కు అడ్డుకట్ట వేయాలని హితబోధ చేశారు. హైదరాబాద్‌లోని ప్రయివేటు దవాఖానల్లో ఈ వ్యాధి చికిత్సకు 10లక్షల రూపాయల వరకు ఖర్చేయ్యేది. సిద్ధిపేట సర్కార్ దవాఖానలో ఒక్క పైసా ఖర్చు లేకుండానే మెరుగైన చికిత్స జరిగింది. ఏది ఏమైనా కార్పొరేట్ దవాఖానల వైద్యానికి ధీటుగా సిద్ధిపేట సర్కార్ జనరల్ దవాఖాన మారడం వెనకాల స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కృషి, చొరవ ఎంతో ఉందనీ చెప్పొచ్చు. తొలి ఆపరేషన్ సక్సెస్ కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ…మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇలాంటి లీడర్ ఉన్నందుకు సిద్ధిపేట ప్రజలు అదృష్టవంతులంటూ మాట్లాడుకుంటున్నారు.