Take a fresh look at your lifestyle.

బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కొత్త వ్యాధి కాదు

  • గతంలో కోఠి ఈఎన్టీలో వైద్యసేవలు అందించాం
  • స్టెరాయిడ్స్, ‌యాంటీబాడీ మందుల వాడకంతో వ్యాప్తి
  • కలుషిత నీటి వల్ల కూడావ్యాప్తికి అవకాశాలు
  • షుగర్‌ ‌వ్యాధి ఉన్న వారికి త్వరగా సోకే ప్రమాదం
  • పోస్ట్ ‌కోవిడ్‌ ‌పేషెంట్లకు కూడా సోకుతోందన్న వైద్యులు

‌బ్లాక్‌ ‌ఫంగస్‌ అనేది కొత్తవ్యాధి ఏకాదని.. గతంలో పలువురు దీని బారిన పడిన వారికి చికిత్సలు అందించామని కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌శంకర్‌ ‌తెలిపారు. బ్లాక్‌ఫంగస్‌ను ఆదిలోనే గుర్తిస్తే ఎండోస్కోపీతో సులువుగా నియంత్రించవచ్చని చెప్పారు. కాకపోతే ఈ వ్యాధి ఇప్పుడే కొత్తగా వచ్చిందే కాదన్నారు. 1985లోనే బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌వ్యాధిబారిన పడి గాంధీ దవాఖానలో ఓ మహిళ మృతి చెందిన ఘటన ఉన్నది. గతంలో కోఠి ఈఎన్టీలోనూ వైద్యసేవలు పొందినవారున్నారు. ఏడాదికి ఒకట్రెండు కేసులు వచ్చేవి. అత్యధికంగా స్టెరాయిడ్స్, ‌యాంటీబాడీస్‌ ‌మందులు వాడకం, కలుషిత నీరు తాగడం, ఆక్సిజన్‌ అం‌దించడంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మనిషి శరీరంలోకి బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌ప్రవేశిస్తుంది.

శరీరంలోని మంచి బ్యాక్టీరియా పూర్తిగా నశించడంవల్ల బ్లాక్‌ఫంగస్‌ ‌వృద్ధి చెందుతుందన్నారు. కొవిడ్‌ ‌నుంచి కోలుకున్నవారిని మళ్లీ వణికిస్తున్న బ్లాక్‌ ‌ఫంగస్‌పై ముందుగానే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఇఎన్‌టి హాస్పిటల్‌ ‌కేంద్రంగా నోడల్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ ‌బారినపడిన ముగ్గురికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహిం చిన కోఠి ఈఎన్టీ వైద్యబృందం మరో ముగ్గురికి సంబంధిత ఎస్‌ఈఎస్‌ఎస్‌ ‌శస్త్రచికిత్స నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. కోఠి ఈఎన్టీలో 30-50 పడకలతో నోడల్‌ ‌కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్‌ ‌శంకర్‌ ‌తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ ఈ సేవలను విస్తరించే అవకాశ మున్నదని అభిప్రాయపడ్డారు. అయితే..షుగర్‌ ‌చెక్‌ ‌చేసుకోవడానికి గ్లూకోటర్‌ ‌తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలన్నారు.

రోజూ ఉదయం పరగడుపున షుగర్‌ ‌చేసుకోవాలంటున్నారు. అప్పుడు షుగర్‌ ‌లెవెల్‌ 125 ‌కంటే తక్కువగా ఉండాలి. టిఫిన్‌ ‌చేసిన అనంతరం గంటన్నర తర్వాత మరోసారి చెక్‌ ‌చేసుకోవాలి. అప్పుడు 250 కంటే తక్కువగా ఉండాలం టున్నారు. వీలైతే ఒకసారి ల్యాబ్‌కు వెళ్లి హెచ్‌బీ ఏ1సీ చూపించుకోవాలని.. గరిష్టంగా 7.2 కంటే తక్కువగా ఉంటే ఇబ్బంది లేదని చెబుతున్నారు. వారం రోజుల్లో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బారినపడిన ముగ్గురికి విజయవంతంగా ఎస్‌ఈఎస్‌ఎస్‌ ‌శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడామని డాక్టర్‌ ‌శంకర్‌ అన్నారు. కింగ్‌కోఠి జిల్లా దవాఖానలో కొవిడ్‌ ‌బారినపడి ఆక్సిజన్‌ ‌పడకపై చికిత్స పొందుతున్న ఓ రోగికి బ్లాక్‌ఫంగస్‌ ‌లక్షణాలు కనిపించడంతో కోఠి ఈఎన్టీకి తరలించారు. మరో ముగ్గురికి సెస్‌ ‌శస్త్ర చికిత్స ద్వారా వైద్యం అందించేం దుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియలో సరోజినీదేవి కంటి దవాఖాన వైద్యుల సూచనలను సైతం పరిగణన లోకి తీసుకుంటున్నారు. .

ముక్కుద్వారా ఫంగస్‌ ‌నియంత్రణ చేపట్టనున్న క్రమంలో ఆఫ్తాల్మాజిస్టులను కూడా భాగస్వాములను చేసి ఎంతమేరకు ఫంగస్‌ను క్లియర్‌ ‌చేయవచ్చు.. కండ్లపై ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సూచనలు తీసుకుంటారు. పోస్టు కొవిడ్‌ ‌బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులను కోఠి ఈఎన్టీ నోడల్‌ ‌కేంద్రానికి తరలించి వైద్యసేవలు అందిస్తాం. కచ్చితంగా నెగెటివ్‌ ‌రిపోర్టు ఉంటేనే సదరు రోగికి ఇక్కడ అనుమతిస్తాం. ఒకవేళ ఇంకా కోలుకోని పక్షంలో గాంధీ దవాఖానలోనే ఉంచి కొవిడ్‌ ‌చికిత్సను కొనసాగిస్తూనే మరోవైపు ఫంగస్‌ ‌కండ్లు, మెదడుకు చేరకుండా యాంటీ ఫంగస్‌ ‌చికిత్స అందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడ కేసు నమోదైనా పోస్టు కొవిడ్‌ అయితే కోఠి ఈఎన్టీ, ప్రీ కొవిడ్‌ అయితే గాంధీలో ఉంచి వైద్య సేవలు అందిస్తామని వివరించారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉంటే వ్యాధి దరిచేరదన్నారు.

Leave a Reply