Take a fresh look at your lifestyle.

అనంతపురం జిల్లాలో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కలకలం

రెండు కేసులను గుర్తించిన వైద్యాధికారులు
అనంతపురం: జిల్లాలో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కలకలం రేపుతోంది. జిల్లా వాసుల్లో ఇద్దరికి బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా యంత్రాంగం జాగ్రత్త వహిస్తోంది. ముగ్గురు హిందూపురం వాసుల్లోనూ అనుమానిత లక్షణాలుఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్టెరాయిడ్‌లు వాడిన కరోనా బాధితుల్లో టెన్షన్‌ ‌నెలకొంది. కరోనాకే జనం విలవిల్లాడిపోతున్న సమయంలో బ్లాక్‌ఫంగస్‌ ‌వైరస్‌ అనంతలో కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఎక్కడో ఈ వైరస్‌ ఉం‌దని అనుకుంటూ ఉండగా అనంతలో రెండు బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు బయటపడ్డాయి. కరోనాకు చికిత్స పొందిన హిందూపురం ప్రాంతానికి చెందిన ఒక న్యాయవాది ఈ బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బారిన పడినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. పామిడి ప్రాంతానికి చెందిన ఓ మహిళ నంద్యాలలో కరోనా బారిన పడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందారు.

ఆమె పామిడికి వచ్చిన తర్వాత బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బారిన పడినట్లు వైద్య వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఇద్దరికి జిల్లా కేంద్రంలోనే చికిత్సలు అందిస్తున్నారు. అందులో ఒకరిని జిల్లా సర్వజనాస్పత్రి ఈఎన్‌టీ వార్డులో, మరొకరికి సూపర్‌ ‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కర్నూలులో అనంతకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బారిన పడి మరణించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌బాధితుల వ్యవహారం బయటకు పొక్కకుండా జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. మొత్తంగా రెండుకేసులు బయటపడడంతో జిల్లాలో ఒక్కసారిగా అలజడి, ఆందోళన మొదలైంది. కరోనా నుంచి కోలుకున్నవారు మాత్రమే బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌వైరస్‌ ‌బారిన పడుతున్నారు.

ఈ ఫంగస్‌ ‌పెరిగిపోవడానికి కరోనా సమయంలో అధికంగా స్టెరాయిడ్స్ ‌వినియోగించడమే కారణమని ఇప్పటికే ఐసీఎంఆర్‌ ‌చెబుతోంది. ఈ ఫంగస్‌ ‌సోకిన వారిలో అధిక మంది మృతి చెందుతున్నట్లు కూడా వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి భయంకరమైన బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌వైరస్‌ అనంతలో వెలుగులోకి రావడం అందరిలో ఆందోళన రేపుతోంది. జిల్లాలో రెండు బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదైన విషయం వాస్తవమేనని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌వెంకటేశ్వరరావు అంగీకరించారు. వారిద్దరికీ జిల్లా కేంద్రంలో చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వైర్‌సకు చికిత్స ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Leave a Reply