Take a fresh look at your lifestyle.

బ్లాక్‌ అం‌డ్‌ ‌వైట్‌ ‌రీల్‌

జీవిత రంగస్థలంలో
ఎన్నో అనుభవాలు,
మరెన్నో జ్ఞాపకాల పుటలు.
కొన్ని మాత్రమే …
జ్ఞాపకాల పొరల్లో శిలాక్షరాల్లా నిక్షిప్తమై,
మన హృదయాలను అప్పుడప్పుడు
పలకరిస్తూ,
ఆనాటి అనుబంధాలను గుర్తుచేస్తూ,
మనసును పరవశంతో పులకరింపచేస్తుంటాయి.
అవి చిలకరించే చిట్టి,చిట్టి ఆనందాలకు
కొలమానం ఉండదు.
వాటిలో బాల్యస్మృతులు మరీనూ!
చిన్నతనంలో…
చెవులు రిక్కించుకొని విన్న నీతికధలు,
ఇసుకలో కట్టిన పిచ్చుక గూళ్ళు,
గూటి బిళ్ళ,కోతి కొమ్మచ్చి,బొంగరాలాట
బొమ్మరిల్లు,బొమ్మల పెళ్లిళ్లు,
అట్లతద్ది ఊయలలు,
నేల, బండబీ దొంగా, పోలీస్‌,
‌కుక్కదూకుళ్ళు,ఏడుపెంకులాట
తొక్కుడుబిళ్ళ,చింతపిక్కలాట,
సైకిల్‌ ‌టైర్‌,‌గోళీలాట
ఇలా…ఒకటా రెండా
లెక్కలేనన్ని జ్ఞాపకాలు.
తిరిగివస్తాయా ఆ రోజులు?
మనసుకు ప్రశాంతతనొసగే కారకాలైన
బాల్యపు పరిమళాలు ఆస్వాదించ
కాలం తరువుకు
ఎన్నెన్ని ఆశల మొగ్గలో…

జీవిత చిత్రంలో
గతకాలపు గురుతులివి.
–  వేమూరి శ్రీనివాస్‌,9912128967,
 ‌తాడేపల్లిగూడెం

Leave a Reply